Add Zee Business As A Preferred Source
App

EPFO 3.O: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. EPFO న్యూ ఫీచర్‌ మైండ్ బ్లోయింగ్.. ఇక సింగిల్ లాగిన్‌తోనే అన్ని సేవలు..!

Written ByAruna Maharaju
Published: Sep 18, 2025, 10:34 PM IST|Updated: Sep 18, 2025, 10:37 PM IST

 
EPFO Passbook Lite: పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను తెలుసుకునేలా పాస్ బుక్ లైట్ పేరుతో న్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి సింగిల్ లాగిన్‌తోనే EPFOకు సంబంధించిన అన్ని సేవలూ, పీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. 
 

 Epfo New Feature Passbook Lite1/5

పాస్ బుక్ లైట్ ఫీచర్

దేశంలో ప్రైవేట్​ సంస్థల్లో పని చేస్తున్న కోట్లాది మంది EPFO ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రతినెల ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ ​ఖాతాలో నగదు జమ అవుతుంది. అయితే ఫీఎఫ్​ నిధుల వివరాలు, క్లెయిమ్స్ కోసం ఆన్‌లైన్​ ద్వారా సంస్థ సేవలు అందిస్తోంది. అయితే వాటిని మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం బ్యాలెన్స్​ చెకింగ్​ కోసం పాస్‌బుక్ పోర్టల్​ లాగిన్​ కావాలి. అదే డబ్బులు విత్​ డ్రా చేయడానికి, ఇతర ​లావాదేవిల కోసం మెంబర్​ పోర్టల్​ లాగిన్​ కావాలి. ఇక నుంచి రెండు సేవలను ఒకే పోర్టల్​లో అందించాలని EPFO నిర్ణయించింది.  

 Epfo New Feature Passbook Lite2/5

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

ఈపీఎఫ్​వో మెంబర్‌ పోర్టల్‌లోనే పీఎఫ్‌ లావాదేవీల వివరాలు తెలుసుకునేలా పాస్‌బుక్‌ లైట్‌ పేరుతో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాస్‌బుక్ ​ కోసం ప్రత్యేకంగా లాగిన్​ కావాల్సిన అవసరం లేదు. సింగిల్‌ లాగిన్‌తోనే EPFOకు సంబంధించిన అన్ని సేవలూ పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. 

 Epfo 3/5

ఈపీఎఫ్‌ఓ కొత్త ఫీచర్

ఇక నుంచి మెంబర్​ లాగిన్​లోనే పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌, విత్‌డ్రా, బ్యాలెన్స్ వంటి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే పాస్‌బుక్ లాగిన్​ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు, గ్రాఫిక్స్‌తో కూడిన సమాచారం కావాలంటే మాత్రం పాస్‌బుక్‌ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు.  

 Epfo New Feature 4/5

ఈపీఎఫ్‌ఓ పాస్ బుక్ లైట్ ఫీచర్

పీఎఫ్​ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ కూడా ఇక నుంచి ఆన్‌లైన్​ పోర్టల్​లో అందుబాటు ఉండనుంది. గతంలో ఇది కేవలం కార్యాలయాల్లో మాత్రమే ఉండేది. అలాగే పీఎఫ్​ విత్‌డ్రాల కోసం వచ్చిన దరఖాస్తులను సైతం వేగంగా పరిష్కరించడానికి EPFO చర్యలు చేపట్టింది.   

 Epfo New Feature Passbook Lite5/5

ఈపీఎఫ్‌ఓ పాస్ బుక్ లైట్

ప్రస్తుతం పీఎఫ్‌ బదిలీ, సెటిల్‌మెంట్లు, అడ్వాన్సులు, రిఫండ్‌ తదితర సేవల కోసం ఆర్పీఎఫ్‌సీ/ ఆఫీసర్‌-ఇన్‌-ఛార్జి స్థాయి అధికారుల ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక నుంచి ఈ బాధ్యతలను అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌, సబార్డినేట్‌ స్థాయి ఉద్యోగులకు అప్పగించారు. దీంతో వేగంగా సెటిల్‌మెంట్లు పూర్తయి ఖాతాదారుల సమయం ఆదా అవుతుందని సంస్థ తెలిపింది.