PF Pension Calculator: పీఎఫ్ ఖాతాదారులకు కిక్ ఇచ్చే న్యూస్.. రిటైర్‌మెంట్ తరువాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..!

EPFO Latest Updates: ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్‌ నుంచి కొంత మొత్తంలో కట్ చేసి ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. అంతే మొత్తంలో కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేస్తుంది. కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్‌ అకౌంట్‌లోకి.. 8.33% ఈపీఎస్‌ ఖాతాలో జమ అవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. పదవీ విరమణ చేసిన అనంతరం పీఎఫ్ ఖాతాదారులకు ఎంత పెన్షన్ వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /8

పదవీ విరమణ అనంతరం ప్రతి ఉద్యోగి కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సాఫీగా పోయేలా ఉండేలా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాడు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈపీఎస్‌ నుంచి పెన్షన్ అందుతుంది.  

2 /8

ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల నుంచి కొంత మొత్తం.. కంపెనీ నుంచి అంతే మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్‌ సభ్యులు ఎంత పెన్షన్ అందుకుంటారో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందా..  

3 /8

మీ వయస్సు 25 సంవత్సరాలు, మీ మూల జీతం రూ.20 వేలు అనుకుంటే.. 20,000×12% = రూ.2,400 ప్రతి నెలా ఈపీఎఫ్‌ ఖాతాలో జమ అవుతుంది. ఇందుకు కంపెనీ సహకారం: రూ.20,000×12% = రూ.2,400. ఇందులో ఈపీఎస్‌కు: 15,000 × 8.33% = రూ. 1,250, (గరిష్ట జీతం రూ.15 వేలపై ఈపీఎస్ లెక్కింపు ఉంటుంది). ఈపీఎఫ్‌లో 2,400–1,250 = రూ.1,150 జమ అవుతుంది.  

4 /8

 EPFలో మొత్తం: రూ.2,400 (ఉద్యోగి) + రూ.1,150 (కంపెనీ)= రూ.3,550 నెలకు జమ అవుతుంది. EPSలో రూ. 1,250 నెలకు జమ అవుతుంది. 35 ఏళ్ల తర్వాత అంటే ఉద్యోగి పదవీ విరమణ తరువాత ప్రతి నెలా రూ.3,550 లెక్కిస్తే ఏడాదికి రూ.42,600 అవుతుంది.  

5 /8

42,600 రూపాయలకు 8.25 శాతం వడ్డీతో 35 సంవత్సరాలపాటు ప్రతి ఏడాది లెక్కిస్తే.. 68.9 లక్షలు అవుతుంది. మీ డబ్బు ప్రతి సంవత్సరం పెరుగుతుంటుంది. మొదటి సంవత్సరంలో రూ.42,600 పై 8.25% వడ్డీ, వచ్చే ఏడాది మునుపటి డబ్బుతోపాటు వడ్డీపై లభిస్తుంది. ఇలా లెక్కిస్తే.. 35 ఏళ్ల సర్వీస్‌లో ఆ మొత్తం రూ.68.9 లక్షలకు చేరుతుంది.  

6 /8

రూ.1,250 ప్రతి నెలా ఈపీఎస్‌లో జమ అవుతుంది. పదవీ విరమణ తర్వాత ఇది పెన్షన్‌గా మారుతుంది. పెన్షన్= (సర్వీస్ సంవత్సరాలు×సగటు జీతం)÷70. రూ.15 వేలకు లెక్కిస్తే.. పెన్షన్ = (35×15,000)÷70=5,25,000÷70 అంటే నెలకు రూ.7,500 అవుతుంది.  

7 /8

ఈపీఎఫ్‌ నుంచి రూ.68.9 లక్షలు,  EPS నుంచి నెలకు రూ.7,500 అవుతుంది. పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవడం కుదరదు. మీరు పదవీ విరమణ తర్వాత 20 సంవత్సరాలు (60 నుంచి 80 సంవత్సరాల మధ్య) జీవిస్తారనుకుంంటే.. 7,500×12×20=రూ.18 లక్షలు పెన్షన్ రూపంలో అందుకుంటారు. అప్పుడు మొత్తం లాభం: రూ.68.9 లక్షలు + రూ.18 లక్షలు = రూ.86.9 లక్షలు అవుతుంది. కానీ ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. మీరు ఎక్కువ కాలం జీవిస్తే.. మరింత పెన్షన్ అందుకుంటారు.  

8 /8

జీతం పెంపుతో ఈపీఎఫ్‌, ఈపీఎస్‌ ఖాతాలో జమ అయ్యే అమౌంట్ కూడా పెరుగుతుంది. అప్పుడు పదవీ విరమణ తరువాత కూడా ఉద్యోగి పొందే మొత్తంలో కూడా పెంపు ఉంటుంది.