EPS Pension: ఉద్యోగులకు శుభవార్త..EPS పెన్షన్ పెంపు..ఈ నెల నుండి కొత్త రేట్లు అమలులోకి వస్తాయా?

EPS Pension Update News: దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు అవసరాల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక మార్పులను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో వస్తున్న ఈపీఎస్ కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి అప్‌డేట్ వచ్చింది.

1 /6

దేశంలో లక్షలాది పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చేందుకు మోదీ సర్కార్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈపీఎస్ పెన్షన్‌ను సవరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సమాచారం.   

2 /6

ఈపీఎస్ విధానంలో ప్రతి ఉద్యోగికి ఇవ్వనున్న కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలంటూ పెన్షనర్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.   

3 /6

కనీస పెన్షన్‌ను రాబోయే నెలల్లో పెంచే అవకాశం కనిపిస్తుంది. అంతకుముందు 2020లో కార్మిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ మద్దతుతో నెలకు 2,000 రూపాయలను కనీస పెన్షన్‌ను అందించాలని సన్నాహాలు జరిగాయి. కానీ, ఆ ప్రణాళికలను ఆర్థిక మంత్రిత్వ శాక ఆమోదించలేదు.    

4 /6

EPS పెన్షనర్ల ప్రతినిధి బృందంలో కొందరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నెలకు రూ.7,500 కనీస పెన్షన్ అందించాలని కోరారు.   

5 /6

ద్రవ్యోల్బణం, పార్లమెంటరీ ఆందోళనలు, దేశంలో ఆర్థిక ప్రభావం కారణంగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత కనీస పెన్షన్‌ను రూ.3,000కి పెంచడాన్ని తీవ్రంగా పరిగణించింది.       

6 /6

చివరిగా.. ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక ప్రభావం కారణంగా కనీస EPS పెన్షన్‌ను రూ. 3,000 కు సవరించాలనే ప్రతిపాదిత వచ్చింది. బడ్జెట్ పరిమితులు, విధానపరమైన పరిగణనలు దాని అమలు సమయం, పరిధిని ప్రభావితం చేయవచ్చు.