BRS Party Meet: రేవంత్ రెడ్డి వైఫల్యాలు ప్రజల ముందుంచాలి: పార్టీ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం
రంగంలోకి: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగారు. రాజకీయంగా కీలక సమావేశం నిర్వహించారు.
శాసనసభా పక్షం: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
ఫామ్‌హౌస్‌లో: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
సభా సమరం: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహారించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
మళ్లీ గడ్డు కాలం: కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. తెలంగాణ మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని కేసీఆర్ వివరించినట్లు సమాచారం.
ఆ ముగ్గురు: సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు, కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో వీరు ముగ్గురు ప్రధానంగా చర్చ చేయనున్నారు.
రేవంత్ వైఫల్యాలు: అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి చేతిగానితనం.. కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలను స్పష్టంగా వివరించాలని.. ప్రజలందకు వాస్తవాలు తెలపాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.