Add Zee Business As A Preferred Source
App

Liquor Lovers: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. పండక్కి ముందే శుభవార్త చెప్పిన రేవంత్ సర్కారు.. ఇంకా కిక్కె కిక్కు..

Written ByInamdar Paresh
Published: Sep 25, 2025, 03:05 PM IST|Updated: Sep 25, 2025, 03:32 PM IST

Revanth Reddy govt key guideline on liquor shops: తెలంగాణ ప్రభుత్వం దసరా పండక్కి ముందు మందుబాబులకు భారీ శుభవార్త చెప్పింది. రేపట్నుంచి కొత్తగా లిక్కర్ షాపులకు రెండెళ్ల పాటు కాలపరిమితి కోసం దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు ధరఖాస్తులు స్వీకరించున్నట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది.

Telangana:1/6

తెలంగాణ:

ప్రస్తుతం దేశ మంతట ఎక్కడ చూసిన దసరా నవరాత్రుల శోభ కన్పిస్తుంది. చాలా మంది స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో తమ సొంతుర్లకు వెళ్లిపోయారు. అయితే..  కొంత మంది నవరాత్రుల్లో ఉపవసాలు చేస్తారు. మద్యం, మాంసాలకు దూరంగా ఉంటారు.  

Liquor shops:2/6

తెలంగాణ మద్యం దుకాణాలు:

కానీ మరికొంత మంది తీరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పండగ వస్తుందంటే.. సెలవులు దొరికాయంటే.. ప్రతిరోజు లిక్కర్ ను తాగడమే ఒకపనిగా పెట్టుకుంటారు. రోజు దోస్తులతో కలుస్తు చుక్కా.. ముక్కాలేనిది వీరికి ముద్ద దిగదని చెప్పుకొవచ్చు.  

dussehra:3/6

దసరా పండగ:

పొరపాటున వీరిని ఇంట్లో తాగనివ్వకుండా బైటకు వెళ్లి లేదా రూమ్ లకు వెళ్లి మద్యం తాగి దోస్త్ లతో ఎంజాయ్ చేస్తారు. ఇదంతా మనం చూస్తుంటాం. ఈ క్రమంలో తెలంగాణ ఆబ్కారీ శాఖ కీలక కొత్తగా మద్యం దుకాణాలపై , షాపుల కేటాయింపులకు కీలక మార్గదర్శకాల్ని జారీ చేసింది.

new liquor shops:4/6

తెలంగాణ మద్యం పాలసీ:

తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్ మార్గదర్శకాల్ని జారీ చేసింది. రేపట్నుంచి అంటే.. (సెప్టెంబర్ 25) నుంచి కొత్తగా మద్యం షాపుల కోసం ధరఖాస్తులు రెండెళ్ల కాలానికి  ( 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది.

Liquor lovers:5/6

లిక్కర్ ప్రియులు:

ముఖ్యంగా కొత్త  మద్యం దుకాణాల కోసం రుసుమును  రూ. 3 లక్షలుగా నిర్ణయించింది. అంతేకాకుండా.. ఆబ్కారీ చట్టం ప్రకారం..1968 ప్రకారం శిక్ష పడిన వారు మాత్రం కొత్తగా దుకాణాలు పొందేందుకు అనర్హులు పేర్కొంది.

telangana new exice shops:6/6

తెలంగాణ మద్యం షాపులు:

ప్రస్తుతం జారీ చేసే లైసెన్సులతో.. రెండు సంవత్సరాల పాటు తెలంగాణలో మద్యం షాపులు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో మందుబాబులు రేవంత్ సర్కారు మాత్రం దసరా పండగకు ముందే పండగ చేసుకుంటున్నారు. మరోవైపు లిక్కర్ పై వచ్చే ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడకుండా.. ఇతర మార్గలతో ఆదాయం క్రియేట్ అయ్యేలా చూడాలని పలువురు మేధావులు కోరుతున్నారు. అయిన కూడా తరచుగా ప్రభుత్వాలు మద్యం ధరల్ని పెంచుతూ లిక్కర్ ప్రియులకు మాత్రం షాక్ లు ఇస్తునే ఉన్నాయి.