Add Zee Business As A Preferred Source
App

Be Alert: బాత్రూమ్‌లో గంటలు గంటలు రీల్స్ చూస్తూ గడిపేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. ఈ భయంకర నిజాలు మీ కోసమే..!

Written ByAruna Maharaju
Published: Sep 03, 2025, 04:01 PM IST|Updated: Sep 03, 2025, 04:01 PM IST

Health Experts Warn: ప్రొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మీతోనే అంటిపెట్టుకుంటున్న మీ ఫోన్‌ని.. మీతో పాటే వదలకుండా బాత్రూంకి కూడా తీసుకెళ్తున్నారా..? గంటలు గంటలు ఫోన్‌ని పట్టుకొని అలాగే బాత్రూంలో కూర్చుంటున్నారా..? అసలు ఇలా చేయడం మీ ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలుసా..? కొద్దిసేపు అని తీసుకెళ్లి అలాగే రిలాక్స్ అవుతూ ఎక్కువ సేపు ఫోన్‌‌తో గడిపితే.. మీకై మీరే మీ హెల్త్‌‌ని నాశనం చేసుకుంటున్నట్లే.. జాగ్రత్త..!

Using Phone in Toilet Issues1/5

బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా

బాత్రూంలో ఫోన్ చూస్తూ ఎక్కువ సమయం గడిపే అలవాటు శారీరక, మానసిక, భావోద్వేగ స్థాయిలను దెబ్బతీస్తుంది. కొంచెం సేపు వీడియోలు చూస్తూ హాయిగా ఉందామని అనుకుంటే.. అది మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. 

Using Phone in Toilet Issues2/5

బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా

బాత్రూంలో ఎక్కువ సేపు కూర్చొని ఫోన్‌లో వీడియోలు చూస్తే శరీరంలో రక్తం సరిగా తిరగదు. దీనివల్ల మల వ్యర్థాలు సరిగా బయటకు వెళ్లక లివర్ దెబ్బతింటుంది. మూత్రం సరిగా బయటకు పోకపోతే మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 

Using Phone in Toilet Issues3/5

బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా

గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చొని ఫోన్ చూస్తే గూని వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. ఇలా ఎక్కువ సమయం ఫోన్‌తో గడపడం వల్ల ఒంటరితనం అలవాటవుతుంది, సమాజంతో దూరం అవుతామనే భావన కలుగుతుంది. 

Using Phone in Toilet Issues4/5

బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా

ఫోన్‌లో వీడియోలు చూస్తూ గంటల తరబడి గడపడం వల్ల మెదడు నరాలు దెబ్బతిని మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

Using Phone in Toilet Issues5/5

బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా

దీని నుంచి బయటపడాలంటే ముందుగా బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లడం మానేయాలి. బయట ఫోన్‌లో అలారం సెట్ చేసి.. ఆ సమయంలో బయటకు రావాలి. బాత్రూం దగ్గర మీకు నచ్చిన సంగీతం లేదా ఆడియో వినేలా ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.