July month festivals in tirumala: తిరుమలలో ఇటీవల భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో తిరుమలకు జులైలో ప్లాన్ చేసుకుంటే ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకొవాలని టీటీడీ పలు సూచనలు చేసింది.
తిరుమల శ్రీవారిని కలియుగ దైవం, కొంగు బంగారంగా భావిస్తారు. మనదేశం నుంచి మాత్రమే కాకుండా..ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఎన్నిగంటలైన సరే క్యూలైన్ లలో వేచి ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగిపోయింది.
పెరిగిన రద్దీలకు అనుగుణంగా టీటీడీ కూడా తిరుమలలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. మొత్తంగా తిరుమలలో ప్రస్తుతం జులై నెల ఆషాడ మాసంలో నిర్వహించే అనేక విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. ముఖ్యంగా.. జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర పూజల్ని నిర్వహిస్తారు.
అదే విధంగా.. జూలై 6న ఆషాడ మాసం నేపథ్యంలో తొలిఏకాదశి దీన్నే చాలా మంది శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.చాలామంది చాతుర్మాస్య వ్రతంను ఆచరిస్తారు. జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం ఉత్సవం నిర్వహిస్తారు. ఈ విశేష పర్వదినాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.
జూలై 10న గురు పౌర్ణమిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజున శ్రీవారి గరుడసేవసైతం నిర్వహిస్తారు. ఆ తర్వాత.. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానంకార్యక్రమం నిర్వహిస్తారు.జూలై 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, జూలై 28న తిరుమల శ్రీవారి పురిశైవారి తోటకు వేంచేపు ను నిర్వహిస్తారు.
అటు తర్వాత.. జూలై 29న గరుడ పంచమి సందర్భంగా శ్రీవారి గరుడసేవఉత్సవంను వైభవంగా నిర్వహిస్తారు. జూలై 30న కల్కి జయంతితో పాటు, కశ్యప మహర్షి జయంతిని కూడా ఎంతో భక్తి భావనలతో తిరుమలలో నిర్వహిస్తారు.
ముఖ్యంగా ఈరోజుల్లో తిరుమల దర్శనం ప్లాన్ చేసుకుంటే.. వయోవృద్ధులు, చిన్న పిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకొని తిరుమలకు రావాలని టీటీడీ భక్తులు పలు సూచనలు చేసింది.