Fastest Snakes: సాధారణంగా పాములు నెమ్మదిగా పాకుతుంటాయి. కానీ నిజానికి కొన్ని పాములు అత్యంత వేగంగా పరుగెత్తగలవు. వాటి చురుకుదనాన్ని చూసి మనుషులు కూడా ఆశ్చర్యపోతారు. వాటిని చంపాలనుకునేవారికి కూడా చుక్కలు చూపిస్తాయి. క్షణాల్లో మాయం అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఫెరారీ కారు కంటే వేగంగా పరుగెత్తే ఐదు రకాల పాముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1/6సైడ్‌వైండర్ రాటిల్‌స్నేక్
ఈ పాము ఎడారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎడారి ఇసుకల్లో కదలడం కష్టం అయినా, సైడ్‌వైండర్ రాటిల్‌స్నేక్ గంటకు 18 మైళ్ల వరకు వేగం అందుకుంటుంది. ఈ పాము ఒకసారి కదలిక ప్రారంభిస్తే, పట్టుకోవడం దాదాపు అసాధ్యం. ఇవి అమెరికా, మెక్సికో ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి.
2/6ఎలుకపాము
ఈ ఎలుక పాములు విషపూరితం కావు. కానీ చురుకుదనంలో చాలా ఫాస్టుగా ఉంటాయి. ఒక్కసారిగా దూసుకెళ్లి సెకనుకు 2.67 మీటర్ల వేగంతో ఎరను పట్టేస్తాయి. చిన్న జంతువులు తప్పించుకోవడానికి ప్రయత్నించినా, ఈ పాముల నుండి తప్పించుకోవడం చాలా కష్టం.
3/6కాటన్ మౌత్ నీటి ప్రాంతాల్లో కనిపించే ఈ పాము వేటాడంతో దిట్ట. ఒకసారి అవకాశం దొరికితే సెకనుకు 2.97 మీటర్ల వేగంతో దాడి చేస్తుంది. దీని విషం ఎరను వెంటనే కదలకుండా చేసి వేట సులభం చేస్తుంది.
4/6కింగ్ కోబ్రా ప్రపంచంలోనే పొడవైన విషపూరిత పాము కింగ్ కోబ్రా. 18 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ పాము ఇతర పాములను ప్రధాన ఆహారంగా తీసుకుంటుంది. పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, వేగంగా కదలడం దీని ప్రత్యేకత. కింగ్ కోబ్ర దాడి క్రూరంగా విషం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఒక కాటు ప్రాణాంతకమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
5/6పసుపు, బొడ్డు సముద్రపు పాము సముద్రంలో ఉండే ఈ పాము అద్భుతమైన ఈత నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. గంటకు 2.5 మైళ్ల వేగంతో ఈదుతూ చేపలను వేటాడుతుంది. అలాగే సముద్రంలోని ఇతర మాంసాహారుల నుండి వేగంగా తప్పించుకుంటుంది.
6/6ఎడారిలోనూ, అడవిలోనూ, సముద్రంలోనూ ఈ పాముల వేగం చూసి ఆశ్చర్యపోక తప్పదు. వేటలోనూ, తమను రక్షించుకోవడంలోనూ ఈ వేగం వీటికి అద్భుతమైన ఆయుధమని చెప్పాలి. అందుకే వీటిని భూమిపై అత్యంత వేగవంతమైన మాంసాహార పాములుగా పరిగణిస్తారు.