Fatty Liver Disease in Children: ఇప్పటివరకూ పెద్దలకే వచ్చే సమస్యగా భావించిన ఫ్యాటీ లివర్.. ఇప్పుడు చిన్నారుల్లో కూడా కనిపిస్తోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి లోపాలు పిల్లల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మీ పిల్లల్లో ఈ చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. ఇవే మీ పిల్లల్లో ఫ్యాటీ లివర్‌కు మొదటి హెచ్చరికలు కావొచ్చు.
1/5చిన్న పిల్లలు సాధారణంగా పిజ్జా, బర్గర్, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్‌ను ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా పిల్లలు ఇష్టపడే ఈ ఆహారాలను తినిపిస్తారు. కానీ ఈ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, ముఖ్యంగా లివర్‌లో కొవ్వు చేరి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
2/5ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో కొవ్వు అధికంగా చేరడం. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఈ సమస్య వల్ల గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, ఇన్సులిన్ సమస్యలు వంటివి రావచ్చు. జంక్ ఫుడ్ తినడం, ఊబకాయం, కుటుంబంలో వచ్చే వంశపారంపర్య సమస్యలు, శరీరంలో ఇన్సులిన్ సమస్యలు, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహారం తక్కువగా తీసుకోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వంటివి దీనికి కారణాలు.
3/5పిల్లలు ఎక్కువ సమయం టీవీ, ఫోన్, కంప్యూటర్ ముందు గడపడం వల్ల శరీరం కదలకుండా ఉంటుంది. ఇది కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న పిల్లలకు అజీర్ణం, పొట్ట నొప్పి, తలనొప్పి, బరువు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
4/5పిల్లలకు తాజా కూరగాయలు, పండ్లు, పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వాలి. జంక్ ఫుడ్, తీపి పదార్థాలు, శీతల పానీయాలు తగ్గించాలి. రోజూ కనీసం ఒక గంట ఆటలు ఆడడం, నడవడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటి శారీరక శ్రమ చేయించాలి. పిల్లలు రాత్రి సరిగ్గా నిద్రపోయేలా చూడాలి.
5/5ఫోన్, టీవీలకు దూరంగా ఉంచి, సరైన నిద్ర అలవాటు చేయాలి. చిన్న మార్పులతో పిల్లల ఆహారం, జీవనశైలిని మెరుగుపరిస్తే ఫ్యాటీ లివర్ సమస్యను నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.