Ttd key update on February month arjitha seva: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి మాసంకు సంబంధించిన స్వామివారి దర్శనం కోటాను విడుదల తేదీలను ప్రకటించింది.
తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా, పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ బాగా ఎక్కువగా ఉంది. ఒకవైపు కార్తీకమాసం, మరోవైపు వీకేండ్ నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంది. శిలాతోరణం వరకు క్యూలైన్ లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
మరోవైపు టీటీడీ సైతం దర్శనాలకువస్తున్న స్వామి వారి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.పానీయాలు, టిఫిన్ లు, భోజన ప్రసాదాల్ని భక్తులకు అందిస్తున్నారు. మరోవైపు టీటీడీ తిరుమల భక్తులకు భారీ శుభవార్త చెప్పింది.
ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జీతసేవల కోటాలను ఈనెల 18న వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అదే విధంగా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం 20 వ తేదీ ఉదయం పదికి నమోదు చేసుకొవడంకు అవకాశం కల్పించింది.
అంగప్రదక్షిణం కోసం నమోదుకు కూడా ఆన్ లైన్ లోనే చేసుకొవాల్సి ఉంటుంది. మరోవైపు లక్కీ డిప్ వస్తే.. 22 తేదీ మధ్యాహ్నంలోపు అమౌంట్ ను ఆన్ లైన్ లో చెల్లించాలని అధికారులు తెలిపారు. మరోవైపు.. 21 ఉదయం 10 కి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జీత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ, వర్చువల్ సేవలు, వాటి దర్శనాలపై కోటాను మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేయనున్నారు.
దీనితో పాటు.. 24న ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ కోటాను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సినియర్ సిటిజన్ లు, దీర్ఘకాల రోగులు, దివ్యాంగులకు ఉచిత కోటా దర్శనాలు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 25 వ తేదీ ఉయం 10 కి ప్రత్యేకంగా రూ. 300ల టికెట్లు కోటా, మద్యహ్నం 3 అద్దె గదులు బుక్కింగ్ లకు కోటాను విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలకు శ్రీవారి అధికారిక వెబ్ సైట్ ను చూడాలని టీటీడీ అధికారులు ఒక ప్రకనటలో వెల్లడించారు.