Heroine Oriented Movies : ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు మన సౌత్ ఇండియాలో చాలా తక్కువగా వస్తాయి. కానీ ఇలా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి.. నిన్నటి వరకు ఈ రేస్ లో.. మహానటి సినిమా మొదటి ప్లేస్ లో ఉండింది.. ఇప్పుడు ఈ సినిమాని సైతం దాటేసింది మరో చిత్రం..
1/5సౌత్ ఇండియాలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు.. ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అరుంధతి, మహానటి లాంటి చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
2/5అరుంధతి చిత్రం అప్పట్లోనే 50 కోట్ల వరకు కలెక్షన్ సాధించి.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత అనుష్క మళ్ళీ భాగమతి చిత్రంతో మంచి కలెక్షన్స్ అందుకుంది.
3/5ఆ తరువాత కూడా ఎన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు రాగా.. మహానటి సినిమా భారీ కలెక్షన్ సాధించి..హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా రేసులో మొదటి ప్లేస్ లో నిలిచింది.
4/5తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 90 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పటికీ కూడా ఈ చిత్రం మొదటి ప్లేస్ లో కొనసాగుతూ ఉండగా.. తాజాగా కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్గా నటించిన లోక్ చిత్రం మహానటి రికార్డులను బ్రేక్ చేసింది.
5/5సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమా కొత్తలోక్ అనే పేరుతో విడుదలయింది. ఇక దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. మొత్తానికి మహానటి సినిమా రికార్డులు బ్రేక్ చేసి.. ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల రేసులో మొదటి ప్లేస్ లో నిలిచింది.