Add Zee Business As A Preferred Source
App

EPF: షాకింగ్..ఉద్యోగం మానేస్తే పీఎఫ్ వడ్డీ ఆగిపోతుందా? అసలు నిజం తెలిస్తే ఈ పని వెంటనే చేస్తారు..!!

Written ByBhoomi
Published: Sep 30, 2025, 11:59 AM IST|Updated: Sep 30, 2025, 11:59 AM IST


Provident Fund: ఉద్యోగం మానేసినా మీ పీఎఫ్ అకౌంట్ వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. మీరు 58ఏళ్ల వయస్సు వరకు ఈ వడ్డీ రేటును పొందవచ్చు. చాలా మంది తమ పీఎఫ్ డబ్బును ముందుగానే విత్ డ్రా చేసుకుంటాను. కానీ అలా చేయడం వల్ల వారు భారీ వడ్డీ ఆదాయన్ని కోల్పోతారు. 
 

PF)1/6

ప్రావిడెంట్ ఫండ్

ఉద్యోగం మానేస్తే.. ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా వడ్డీ ఆగిపోతుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ వాస్తవానికి అలాంటిదేం జరగదు. EPFO నిబంధనల ప్రకారం, మీరు ఉద్యోగం మానేసి కూడా PF మొత్తాన్ని విత్ డ్రా చేసుకోకపోతే..  మీ ఖాతా 58 సంవత్సరాలు వచ్చే వరకు వడ్డీ సంపాదిస్తూనే ఉంటుంది. 

EPF Provident Fund2/6

PF డబ్బు మరో 18 సంవత్సరాలు వడ్డీ

ఉదాహరణకు, 40 సంవత్సరాల వయసులో ఉద్యోగం వదిలేస్తే, PF డబ్బు మరో 18 సంవత్సరాలు వడ్డీతో పెరుగుతుంది. అంతేకాకుండా, పదవీ విరమణ తర్వాత వెంటనే డబ్బు తీసుకోకపోతే కూడా, ఖాతా మరో మూడు సంవత్సరాలు (61 ఏళ్లు వచ్చే వరకు) వడ్డీ అందిస్తుంది. ఆ తర్వాత ఖాతా నిష్క్రియం అవుతుంది. అంటే వడ్డీ జమ ఆగిపోతుంది కానీ డబ్బు మాత్రం సురక్షితంగానే ఉంటుంది.

PF Withdrawal3/6

EPFపై 8.25శాతం వడ్డీ

చాలా మంది ఉద్యోగం వదిలిన వెంటనే PF డబ్బు తీసేసుకుంటారు. దీంతో వారు సంవత్సరాల తరబడి వచ్చే వడ్డీ లాభం కోల్పోతారు. ప్రస్తుతం ప్రభుత్వం EPFపై 8.25శాతం వడ్డీ ఇస్తోంది. 

Retirement Savings4/6

ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇతర పెట్టుబడుల కంటే ఆకర్షణీయమైన రాబడి. అందువల్ల మీకు డబ్బు తక్షణం అవసరం లేకుంటే, PF మొత్తాన్ని ఖాతాలో ఉంచడం అత్యంత ప్రయోజనకరం. దీని వల్ల పదవీ విరమణ సమయానికి మీ వద్ద పెద్ద మొత్తంలో నిధులు చేరతాయి.  

EPF Interest5/6

PF ఉపసంహరణ

PF ఉపసంహరణను ఆన్‌లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు. EPFO వెబ్‌సైట్‌లోకి UAN నంబర్‌తో లాగిన్ అయ్యి, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలను అప్డేట్ చేసి, క్లెయిమ్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేయాలి. కారణాన్ని ఎంచుకుని OTPతో వేరిఫై చేసిన తర్వాత, మీ డబ్బు సాధారణంగా 7–8 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

Money Tips6/6

ఉద్యోగి భవిష్యత్తుకు ఒక ఆర్థిక రక్షణ

EPF కేవలం పొదుపు మాత్రమే కాదు, ఉద్యోగి భవిష్యత్తుకు ఒక ఆర్థిక రక్షణ కవచంలా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత జీవన భద్రత కల్పించే ఈ పథకం వల్ల ఉద్యోగి, కుటుంబానికి గట్టి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కాబట్టి డబ్బు అవసరం లేకపోతే PF మొత్తాన్ని అలాగే ఉంచి, వడ్డీ లాభాన్ని పొందడం ఉత్తమ నిర్ణయమని చెప్పవచ్చు.