Add Zee Business As A Preferred Source
App

Serpent Idols: చేపల వలలో సర్ప విగ్రహాలు.. వేటకు వెళ్లిన మత్స్యకారులకు షాక్.. ఎక్కడో తెలుసా..?

Written ByAruna Maharaju
Published: Sep 23, 2025, 11:20 AM IST|Updated: Sep 23, 2025, 11:26 AM IST

Serpent idols found at sea: కేరళ రాష్ట్రంలో ఓ వింత సంఘటన జరిగింది. సముద్రంలో చేపలు పట్టడానికి వల వేసిన మత్స్యకారుడికి రెండు సర్ప విగ్రహాలు దొరికాయి. ఈ విగ్రహాలు చాలా పాతవి మరియు ఇత్తడితో చేసినవని స్థానికులు చెప్పారు.  

Serpent Idols 1/5

సర్ప విగ్రహాలు

కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మత్స్యకారులు చేపల వేటకోసం వేసిన వలలో రెండు సర్ప విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి చాలా పురాతనమైనవి మరియు ఇత్తడితో తయారు చేసినవిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.  

Serpent Idols In Fisherman Nets2/5

సర్ప విగ్రహాలు

అళికోడ్ సమీపంలోని పుతియా కడపపురం ప్రాంతానికి చెందిన రస్సల్ అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. వలలో ఈ విగ్రహాలు చిక్కుకోవడంతో అతను ఆశ్చర్యపోయాడు. 

Serpent Idols In Fisherman Nets3/5

కేరళలో చేపల వేటలో సర్ప విగ్రహాలు

ఆ సర్ప విగ్రహాలను ఒడ్డుకు తీసుకొచ్చి శుభ్రం చేశాడు. ఒక్కో విగ్రహం బరువు సుమారు ఐదు కిలోలు ఉంది. అయితే రస్సల్ ఈ విగ్రహాలను పోలీసులకు అప్పగించాడు. 

Fisherman Nets Serpent Idols Off Kerala Coast4/5

కేరళలో చేపల వేటలో సర్ప విగ్రహాలు

ఈ విగ్రహాలు సముద్రంలో ఎలా వచ్చాయి, ఎవరైనా దొంగిలించారా లేక కావాలనే వేశారా అని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. 

చేపల వలలో సర్ప విగ్రహాలు5/5

Serpent Idols In Fisherman Nets

ఇత్తడి సర్ప విగ్రహాలను సాధారణంగా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచుతారు. ఇవి ఇంటిని చెడు శక్తుల నుండి కాపాడతాయని ప్రజలు నమ్ముతారు.