Add Zee Business As A Preferred Source
App

Weight Loss: బాలీవుడ్ సెలబ్రిటీస్ రోజు తినే స్నాక్ ఏమిటో తెలుసా.. బరువు తగ్గటంతో పాటు యమ్మీ యమ్మీగా..

Written ByVishnupriya
Published: Oct 13, 2025, 06:29 PM IST|Updated: Oct 13, 2025, 06:29 PM IST

Weight Loss Snack : మనందరికీ మధ్యాహ్నం లేదా సాయంత్రం ఆకలిగా.. ఉన్నప్పుడు చిప్స్, బిస్కెట్లు లేదా వేయించిన వంటకాలు తినాలనిపిస్తుంది. కానీ ఇవి శరీరానికి మంచివి కావు. అలాంటి సమయాల్లో ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం అని సెలబ్రిటీ ట్రైనర్ యాస్మిన్ కరాచివాలా చెబుతున్నారు.

Bollywood Celebrities Weight Loss1/5

ఆరోగ్యకరమైన స్నాక్

యాస్మిన్ కరాచివాలా..దీపికా పడుకోణె.. కత్రినా కైఫ్, అలియా భట్ లాంటి స్టార్‌లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమె ఇటీవల ఒక వీడియోలో తనకు ఇష్టమైన ఆరోగ్యకరమైన స్నాక్ గురించి చెప్పదంతో అది కాస్త వైరల్ అవుతోంది. ఇంతకీ అదేమిటి అంటే.. వేయించిన బాదంపప్పు.

Celebrities Snacks 2/5

ఆరోగ్యకరమైన స్నాక్

ప్రతిరోజూ కొంచెం బాదంపప్పు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది, శరీరానికి శక్తి వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంపప్పులో ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంచుతాయి.. దాంతో అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది.

Weight Loss Evening Snacks3/5

ఆరోగ్యకరమైన స్నాక్

ఒక పరిశోధన ప్రకారం..ఉదయం బాదంపప్పు తిన్నవారు మధ్యాహ్నం తక్కువ ఆకలిగా ఉన్నారని తేలింది. అదే సమయంలో.. బిస్కెట్లు లేదా చిప్స్ తిన్నవారికి..త్వరగా ఆకలి అనిపించింది.

Almond For Weight Loss4/5

ఆరోగ్యకరమైన స్నాక్

బాదంపప్పులో విటమిన్ E, మాగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి మంచి చేయడమే కాకుండా.. చర్మానికి కాంతినిస్తాయి.. రక్తంలో చక్కెర స్థాయిలను సరిగా ఉంచుతాయి. రోజూ కొంచెం బాదంపప్పు తింటే శరీరం బలంగా ఉంటుంది. దీన్ని పిల్లలు, పెద్దలు, అందరూ తినవచ్చు. ఇది తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం కాబట్టి బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది.

Weight Loss Tips5/5

ఆరోగ్యకరమైన స్నాక్

“ఆరోగ్యంగా ఉండడం అంటే పెద్ద డైట్ ప్లాన్‌లు కాదు, చిన్న మంచి అలవాట్లు పాటించడం. ప్రతి రోజు కొద్దిగా బాదంపప్పు తినడం అలాంటి మంచి అలవాటు. దీపికా పడుకోణె లాంటి నటీమణులు కూడా ఈ అలవాటు పాటిస్తారు. వారు రోజూ బాదంపప్పు తినడం వల్ల ఫిట్‌గా.. ఎనర్జీగా ఉంటారు.” అని చెప్పుకొచ్చారు యాస్మిన్.