Add Zee Business As A Preferred Source
App

Apple iPhone 17: వారెవ్వా.. ఆపిల్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ 10 నిమిషాల్లోనే ఐఫోన్-17 హోమ్ డెలివరీ..!

Written ByAruna Maharaju
Published: Sep 20, 2025, 06:48 PM IST|Updated: Sep 20, 2025, 07:30 PM IST

 

Flipkart Big Billion Days Sale : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్. మీరు న్యూ ఆపిల్ ఐఫోన్ 17 కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సందర్భంగా.. కేవలం 10 నిమిషాల్లోనే స్మార్ట్‌ఫోన్ డెలివరీని అనౌన్స్ చేసింది. ఇందులో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి..

Iphone 17 Home Delivery1/5

ఐఫోన్ 17 సిరీస్ 10 నిమిషాల హోమ్ డెలివరీ

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. కొత్త ఐఫోన్ 17 కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో.. కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీని ప్రకటించారు. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సర్వీస్ సెలక్ట్ చేసిన నగరాల్లో భారీ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ డీల్‌లతో పాటు అందుబాటులో ఉంటుంది.

 

Iphone 17  2/5

ఐఫోన్ 17 సిరీస్ 10 నిమిషాల హోమ్ డెలివరీ

 

సెప్టెంబర్ 23 నుంచి (ప్లస్, బ్లాక్ యూజర్లకు సెప్టెంబర్ 22 నుంచి ముందస్తు యాక్సెస్‌తో) స్టార్ట్ కానుంది. ఈ పండుగ సీజన్ సేల్ సమయంలో భారత మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ మొదటిసారిగా స్పీడ్ డెలివరీ చేయనుంది.

 

 

Iphone 17 Home Delivery3/5

ఆఫిల్ ఐఫోన్ 17

భారత మార్కెట్లో సెప్టెంబర్ 19న అమ్మకానికి వచ్చిన ఐఫోన్ 17 సిరీస్‌ని కొనేందుకు.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణేలోని ఆపిల్ స్టోర్లలో కొనుగోలుదారులు ఎగబడ్డారు. ఆపిల్ అవుట్‌లెట్‌ల బయట గంటలు గంటలు క్యూలో నిలబడ్డారు. ఇప్పుడు ఈ ఫ్లిప్‌కార్ట్ 10 నిమిషాల డెలివరీతో.. స్టోర్ల ముందు వెయిట్ చెయ్యాల్సిన అవసరం ఉండదు.

Iphone 17 Ten Minutes Home Delivery4/5

ఆఫిల్ ఐఫోన్ 17

 

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, బెంగళూరుతో సహా సెలక్ట్ చేసిన నగరాల్లోని కస్టమర్లు.. తమ ఐఫోన్ 17ను ఈ సేల్ సమయంలో 24/7 నిమిషాల్లో డెలివరీ చేసుకోవచ్చు. ఈ సర్వీసు ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది.

 

Iphone 17 Home Delivery5/5

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025

బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 అధికారికంగా సెప్టెంబర్ 23న ప్రారంభంకానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు.. సెప్టెంబర్ 22న ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. ఇక ప్రీమియం సభ్యులు అందరికంటే ముందుగా 10 నిమిషాల డెలివరీ ఆఫర్, ప్రత్యేక డిస్కౌంట్‌లను పొందవచ్చు.