Madhuri Dixit Kiss Scene: మాధురి దీక్షిత్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ లో ఏక్ దో తీన్ పాటతో ఆల్ ఇండియా ను షేక్ చేసింది. అంతేకాదు దాదాపు మూడు దశాబ్దాలుగా హిందీ చిత్ర సీమను ఏలిన భామ. అయితే.. ఈమె అందానికి మైమరిచిపోయిన ఓ హీరో ఆ తర్వాత బీజేపీ ఎంపీగా పనిచేసిన నటుడు ఓ సీన్ షూట్ సందర్భంలో మైమరిచిపోయి.. మాధురి దీక్షిత్ పెదవులు రక్తం కారేలా ముద్దుపెట్టుకున్నాడు. ఇంతకీ ఎవరంటే..
Madhuri Dixit: మాధురి దీక్షిత్ 1984లో 17 యేళ్ల వయసులో ‘అబోధ్’ అనే హిందీ మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. 1988లో ఎన్. చంద్ర దర్శకత్వంలో అనిల్ కపూర్ హీరోగా నటించిన ‘తేజాబ్’ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో స్థిర పడిపోయింది.
ఈ సినిమాలో మాధురి దీక్షిత్ చేసిన ఏక్, దో, తీన్, చార్, పాంచ్, ఛే-సాత్ అంటూ నౌ పాట ఇప్పటికీ బాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఛార్ట్ బస్టర్ గా నిలిచిపోయింది.
57 ఏళ్లు పైబడినప్పటికీ, నటి మాధురీ దీక్షిత్ తన ఆకర్షణీయమైన అందం, మనోహరమైన చిరునవ్వుతో లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో ఇప్పటికీ స్థానం సంపాదించుకుంది. మాధురీ దీక్షిత్ ఒక ప్రఖ్యాత నటి, చిత్ర పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉంది.
మాధురి దీక్షిత్ అంటే అందమే కాదు.. నటనతో పలువురిని తన అభిమానులుగా చేసుకుంది. కళ్లతోనే పాత్రకు ప్రాణం పోసే అరుదైన నటీమణుల్లో మాధురి దీక్షిత్ నేనె ఒకరు. ఈమె కెరీర్ మొదట్లో ఓ చేదు సంఘటన ఎదురైంది.
నటిగా అపుడపుడే ఇండస్ట్రీకి వచ్చిన మాధురి దీక్షిత్ అందానికి ఎంతో అభిమానులు ఫిదా అయ్యారు. కేవలం ప్రేక్షకులే కాదు.. సినిమా హీరోలు సైతం ఆమె అందానికి మైమరిచి పోయారు. 1988లో ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంలో వినోద్ ఖన్నా హీరోగా తెరకెక్కింది ‘దయావాన్’. ఈ మూవీ కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకుడు’ మూవీకి రీమేక్.
ఈ సినిమాలో మాధురి దీక్షిత్ కథానాయికగా నటించింది. అందులో ఓ సన్నివేశంలో హీరో వినోద్ ఖన్నా.. మాధురి దీక్షిత్ తో ఓ ఇంటిమేట్ సీన్ చేస్తున్నడు. అందులో భాగంగా పెదాలపై ముద్దు పెట్టుకునే సీన్ ఉంది. ఆ సన్నివేశం చేస్తున్న సమయంలో మాధురి అందానికి పరవశానికి లోనై అతను ఆమె పెదాలను రక్తం కారేవరకు కొరికేసాడు. దర్శకుడు కట్ చెప్పినా.. హీరో మాత్రం మాధురి దీక్షిత్ పెదాలను జుర్రేస్తూనే ఉన్నాడు.
ఆ తర్వాత వినోద్ ఖన్నా.. తన తప్పు తెలుసుకొని మాధురి దీక్షిత్ ను కలిసి క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు ఆ తర్వాత మరే సినిమాలో ముద్దు సీన్ చేయనని చెప్పడమే కాదు. దానికి కట్టుబడి ఉన్నాడు. ఈ సినిమా మాధురి దీక్షిత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సీన్ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
వినోద్ ఖన్నా విషయానికొస్తే.. ఈయన బీజేపీ తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాదు వాజ్ పేయ్ మంత్రివర్గంలో మంత్రిగాను పని చేసారు. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చనిపోయిన తర్వాత అందుకున్న ఏకైక సినీ వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసారు. ఈయన కుమారుడు అక్షయ్ ఖన్నా.. బాలీవుడ్ నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విడుదలైన ‘ఛావా’లో ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయాడు అనే కంటే జీవించాడు.