Add Zee Business As A Preferred Source
App

Friendship day variety gifts: ఫ్రెండ్షిప్ డే కి అదిరిపోయే వెరైటీ గిఫ్ట్ లు.. రొటీన్ గా ఆలోచించకండి..!

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Aug 02, 2025, 09:21 AM IST|Updated: Aug 02, 2025, 09:21 AM IST

Friendship day different gifts 
ఆగస్టు మొదటి ఆదివారం అందరూ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు అన్న సంగతి తెలిసిందే. బాధలోనూ, ఆనందంలోనూ తమ వెంట నిలిచే స్నేహితులకు ఈ రోజున ప్రత్యేకంగా విషెస్ చెబుతారు. మరి విషెస్ చెప్పదమే కాదు ఎలాంటి గిఫ్ట్లు ఇస్తే స్నేహితులు హ్యాపీ ఫీలవుతారో చూద్దాం..
 

Memories 1/5

ఏవైనా కాలం గడిచే కొద్దీ పోతాయి కానీ.. జ్ఞాపకాలు మాత్రం కాదు. అందుకే ఆ జ్ఞాపకాలను ఫోటో ఫ్రేమ్ బదులు ఏదైనా పెయింటింగ్ లాగా వేయిచ్చి దానికి గ్లాస్ ఫ్రేమ్ పెట్టి మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి.. చాలా సంతోషిస్తారు..

Useful Things2/5

ప్రతి ఒక్కరి జీవితంలో.. డబ్బు అనేది కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఎంత యూపిఐ ఉన్నా కానీ మనం ఎక్కడికి వెళ్లినా డబ్బు కొంచెం అయినా మనతో తీసుకెళ్లడం ముఖ్యం. అందుకనే  అబ్బాయిలు అయితే నీ ఫోటో తన ఫోటో పైన ప్రింట్ చేయించిన పర్స్.. అమ్మాయిలైతే నీది, తనది ప్రింట్ చేయించిన హ్యాండ్ బ్యాగ్ లాంటివి గిఫ్ట్ ఇవ్వండి.

Lovable Things3/5

మీ స్నేహితుల గురించి మీకన్నా బాగా ఎవరికి తెలుస్తుంది. కొంతమందికి మ్యూజిక్ ఇష్టముండొచ్చు మరి కొంతమందికి సినిమాలు ఇష్టం ఉండొచ్చు ఇంకొంతమందికి గేమ్స్ ఇష్టం ఉండొచ్చు. కాబట్టి మీ స్నేహితులకు ఏది ఎక్కువ ఇష్టమో దానికి సంబంధించిన గిఫ్ట్ ఏదైనా ఇవ్వండి. మ్యూజిక్ ఇష్టమైతే మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్.. సినిమాలు ఇష్టమైతే బుక్మైషో కార్డ్ లాంటివి ఇవ్వచ్చు.

Accessories 4/5

ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో సేల్స్ జరుగుతున్నాయి. మీ ఫ్రెండ్ అమితంగా ఇష్టపడే ఏదో ఒక వస్తువు ఉంటుంది. అంటే కార్, బైక్ లాంటివి ఉంటే దానికి ఉపయోగపడే యాక్ససరీస్ ఏవైనా కొనివ్వండి.

Think Different 5/5

ఇలా ఏదైనా కొత్తగా ఆలోచించి అలానే మీ ఫ్రెండ్ ఇష్టపడేలా ఆలోచించి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా చాలు.. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అలానే ఈ గిఫ్ట్ తో పాటు చిన్న లెటర్ రాసి ఇవ్వండి.. అందులో మీ బావలన్నీ వ్యక్తపరచండి.. దానికి వాళ్ళు ఇంకా ఎక్కువ సంతోష పడొచ్చు.