Add Zee Business As A Preferred Source
App

New Rules From October: అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్.. పెన్షన్ నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ వరకు మారే అంశాలివే..!!

Written ByBhoomi
Published: Sep 28, 2025, 10:26 AM IST|Updated: Sep 28, 2025, 10:26 AM IST


New Rules From October: ఇంకో రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల ముగిసిన అక్టోబర్ నెలలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ క్రమంలో 1వ తేదీ వస్తూ వస్తూనే కొత్త రూల్స్ కూడా తీసుకువస్తోంది. ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. 

New Rules From October1/8

ఈ అక్టోబర్ 1వ తారీఖు

ఈ అక్టోబర్ 1వ తారీఖు నుంచి చాలా మంది ప్రయాణికులు, ఉద్యోగులు అలాగే కొందరు వ్యక్తులను ప్రభావితం చేసే కొన్ని రూల్స్ అమల్లోకి రానున్నాయి. ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి పెన్షన్ వరకు సంబంధించి కీలక మార్పులు జరగబోతున్నాయి. ఈ అప్ డేట్స్ ఏంటి. ఆయా వర్గాలకు చెందిన ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

NPS2/8

జాతీయ పెన్షన్ వ్యవస్థ

జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) గురించి మాట్లాడితే   ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ కోసం ఒక ముఖ్యమైన పెట్టుబడి పథకం. అక్టోబర్ 1 నుండి, ఈ పథకంలో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు NPS పెట్టుబడిదారులు పరిమితంగా మాత్రమే ఈక్విటీలో పెట్టుబడి పెట్టగలిగారు. కానీ కొత్త మార్పుల ప్రకారం ప్రభుత్వేతర రంగానికి చెందిన సబ్‌స్క్రైబర్లు తమ పెట్టుబడిలో 100శాతం వరకు ఈక్విటీలో పెట్టగలరు. 

Central record keeping agencies3/8

సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీల

దీంతో ఎక్కువ రాబడి ఆశించే వారికి ఇది మంచి అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. అదనంగా, ఒకే PRAN నంబర్ కింద పలు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీల (CRAs) పథకాలలో ఒకేసారి పెట్టుబడి పెట్టే సౌకర్యం కల్పిస్తుంది. ఇకపై, నిష్క్రమణ నిబంధనలలో కూడా మార్పులు వస్తాయి. పెద్ద మొత్తం ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి, అలాగే పాక్షిక ఉపసంహరణను మరింత సులభతరం చేయడం జరుగుతుంది.

Indian Railways Ticket Booking Procedure4/8

ఇండియన్ రైల్వే టిక్కెట్ బుకింగ్ విధానం

ఇండియన్ రైల్వే టిక్కెట్ బుకింగ్ విధానంలో కూడా మార్పులు రానున్నాయి. అక్టోబర్ 1 నుండి, రైల్వే సాధారణ రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల వరకు ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. దీని వల్ల టిక్కెట్ మాఫియాలు లేదా ఫేక్ బుకింగ్‌లు తగ్గిపోవడం, నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు అందుబాటులో ఉండడం జరుగుతుంది. రైల్వే PRS కౌంటర్లలో టిక్కెట్ కొనుగోలు విధానం ఎటువంటి మార్పు లేకుండా యథావిధిగా కొనసాగుతుంది. అధీకృత ఏజెంట్లకు మొదటి 10 నిమిషాల్లో టిక్కెట్లు బుక్ చేసే అవకాశం లేకుండా ఉన్న నిబంధన కూడా కొనసాగుతుంది.

New law on online gaming regulation5/8

ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణపై కొత్త చట్టం

ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణపై కొత్త చట్టం అమల్లోకి రాబోతోంది. ఇటీవల యువతలో పెరుగుతున్న వ్యసనం, డబ్బు నష్టాలు, అలాగే మనీలాండరింగ్ వంటి సమస్యలను నివారించడానికి ఈ చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, Dream11, Pokerbaazi వంటి రియల్ మనీ గేమ్‌లను నిషేధిస్తారు. అయితే, ఇ-స్పోర్ట్స్‌లకు మాత్రం ప్రోత్సాహం ఇవ్వనుంది. 

Support financial transactions6/8

ఆర్థిక లావాదేవీలను సపోర్ట్

ఈ చట్టాన్ని ఉల్లంఘించిన కంపెనీలు లేదా వ్యక్తులకు గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించవచ్చు. అలాగే, బ్యాంకులు ఈ రకమైన ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను సపోర్ట్ చేయరాదు.

Effective October 1, 20257/8

అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి

మొత్తం చూస్తే, అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చే ఈ మార్పులు సాధారణ ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగకరంగా మారనున్నాయి. రిటైర్మెంట్ ప్లానింగ్ మరింత లాభదాయకం అవుతుండగా, రైల్వే టిక్కెట్ల బుకింగ్ పారదర్శకంగా మారుతుంది.

Online gaming8/8

ఆన్‌లైన్ గేమింగ్

 అలాగే, ఆన్‌లైన్ గేమింగ్ వల్ల కలిగే సమస్యలను కూడా ప్రభుత్వం నియంత్రించబోతోంది. ఇవన్నీ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు, ప్రజల భద్రతకు ఉపయోగపడే కీలక అడుగులుగా చెప్పవచ్చు.