Beautiful IAS officer India: మనదేశంలో అందం, మేదస్సు రెండింటినీ సమపాళ్లలో కలిగి ఉన్న మహిళా అధికారణుల్లో ఒకరు ఐఏఎస్ స్మితా సబర్వాల్. స్మితను చాలామంది అందంలో హీరోయిన్లకంటే కంటే మించి ఉండే అధికారి అంటూ కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఆమె అందం కంటే గొప్పది కృషి, ప్రతిభ, సేవాభావం. ఇవే స్మితా సబర్వాల్ ను ఉన్నతస్థానంలో నిలిపాయి.
స్మితా సబర్వాల్ తెలంగాణ కేడర్‌కు చెందిన 2001 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి. కేవలం 22 ఏళ్ల వయసులోనే UPSC సివిల్స్ పరీక్షను ఉత్తీర్ణత సాధించి, ఆ సమయంలోనే తన ప్రతిభను నిరూపించారు. ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమితులైన మొదటి మహిళా ఐఏఎస్ అధికారిగా చరిత్ర సృష్టించారు.
2/61977లో పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన స్మితా, తన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే పూర్తిచేశారు. చిన్నతనం నుంచే ఆమె చదువులో ప్రథమురాలిగా నిలిచి, బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించారు. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, గ్రాడ్యుయేషన్ సమయంలోనే UPSC పరీక్షలకు సిద్ధమయ్యారు.
తన కెరీర్ ప్రారంభం నుంచే ప్రజలతో నేరుగా కలిసిపోతూ పనిచేసే విధానంతో స్మితా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. పాలనలో పారదర్శకత, సామాజిక సేవపై ఆమె చూపే నిబద్ధత ఆమెను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది.
4/6స్మితా తన బ్యాచ్‌మేట్, IPS అధికారి డాక్టర్ అకున్ సబర్వాల్‌ను 2004లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
స్మితా సబర్వాల్ కేవలం ఒక అధికారి మాత్రమే కాదు.. సోషల్ మీడియా లో కూడా ఆమెకు ఫాలోవర్స్ భారీగా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, X (ట్విట్టర్) వంటి వేదికలలో ఆమె చురుకుగా ఉంటూ, తన అనుభవాలు, ప్రేరణాత్మక సందేశాలు, సొగసైన ఫోటోలు పంచుకుంటారు. అందుకే ఆమెను అభిమానులు "మెదళ్లున్న అందగత్తె" (Beauty with Brains) అని సంబోధిస్తారు.
తన తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో, క్రమశిక్షణ, బాధ్యత, దేశసేవ అనే విలువలు స్మితా జీవితంలో బలంగా నాటుకుపోయాయి. నేటి యువతకు ఆమె నిజమైన ప్రేరణాత్మక ఆదర్శం.