Gaja Kesari yogam 2025: గజకేసరి యోగం అంటే గజ అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. ఈ రెండూ కలిసినప్పుడు, చాలా బలమైన యోగం ఏర్పడుతుంది. దీనిని గజకేసరి యోగంగా పేర్కొంటారు.
Gaja Kesari yogam 2025: జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి, చంద్రుడు కేంద్ర స్థానంలో కలిసినపుడు, అత్యంత శుభకరమైన యోగాలలో ఒకటైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుజుడు, బృహస్పతి. మనస్సు కారకుడైన చంద్రుడు కేంద్ర స్థానంలో ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు, శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం, ఈ యోగంతో ఐదు రాశుల జీవితాలలో బృహస్పతి కారణంగా ఆర్ధికంగా, సామాజిక పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
మకర రాశి.. గజకేసరి యోగంతో మకర రాశి వారికి అఖండ ధనయోగ ప్రాప్తం ఏర్పడుతుంది. గజకేసరి యోగం ఆశించిన విజయాన్ని ఇస్తుంది. కోర్టు కేసులలో మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో కొత్త ఎత్తులకు ఎదగడానికి అవకాశం ఉంది.
వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి గజ కేసరి యోగంతో వీరికి భూమి సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అంతేకాదు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారు. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడుతున్నాయి. మీ చేతులకు భారీ మొత్తంలో సంపద లభిస్తుంది.
కుంభ రాశి.. ఈ రాశుల వారి జీవితాల్లో గజకేసరి రాజయోగం గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది. సామాజిక జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడతారు.
వృషభ రాశి.. గజకేసరి యోగం ఫలితంగా, వృషభ రాశి వారికి చాలా కాలంగా వారిని వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. మానసిక సమస్యలు దూరం అవుతాయి.
సింహ రాశి.. సింహ రాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి పురోగతిని లభించే అవకాశం ఉంది. ఏ కారణం చేతనైనా నిలిచిపోయిన వివాహా ప్రతిపాదనలలో సానుకూలత ఉంటుంది. మునుపటి ప్రయత్నాలకు శుభ ఫలితాలను అందుకుంటారు.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.