Gajakesari Raja Yogam: జ్యోతిషశాస్త్రంలో కొన్ని గ్రహాల నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తుంటాయి. దీని వలన కొన్ని రాశుల మార్పు కారణంగా అనేక రకాల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. దేవ గురువు బృహస్పతి, చంద్రుడు కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడబోతుంది.
Gajakesari Raja Yogam: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహ మండలంలో చంద్రుడు, బృహస్పతి కలయికతో బలమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. బుధుడు జూన్ 23, 2025న మిథున రాశిలో సంచారము చేయనున్నాడు. గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు. బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించిన వెంటనే, గురు-చంద్రుల కలయిక ఏర్పడుతుంది, దీని కారణంగా గజకేసరి రాజ్యయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏ రాశులకు ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకుందాము.
మిథున రాశి: గజకేసరి రాజ యోగం వలన మిథున రాశి వారు ఎక్కువ ప్రయోజనాలు అందుకుంటారు. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఇది శుభ తరుణం. భాగస్వామ్య వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుందట. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి గజకేసరి రాజ్యయోగం వలన అనేక శుభ ఫలితాలను అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. జీవితాన్ని సుఖాలతో తేలుతారు. మీ కార్యాలయంలో కొత్త గుర్తింపును పొందుతారు. ఆరోగ్యం గతంలో కంటే మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది. పెట్టుబడి నుండి కూడా లాభాలను అందుకుంటారు.
మేషరాశి.. గజకేసరి రాజయోగం వలన మేష రాశి వారి చాలా శుభ ఫలితాలను అందుకుంటారు. జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం.
కన్య రాశి: గజకేసరి రాజ యోగం వలన కన్య రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. మీ సంపద, శ్రేయస్సు పెరుకే అవకాశాలున్నాయి. వ్యాపారం లాభ దాయకంగా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి క్షణాలు గడుపుతారు. మీరు చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. మీరు పిల్లల నుండి శుభవార్త అందుకుంటారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. భూమి, వాహనం యోగం కలగబోతుంది.
గమనిక: ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా నిజం అని చెప్పడం లేదు. పంచాంగాలు, జ్యోతిష్యం శాస్త్రం ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు. ఏదైనా సమాచారం కోసం సరైన పండితులను సంప్రదిస్తే మంచిది.