Gajakesari Rajayogam: 2026 కొత్త యేడాదిలో బృహస్పతి, చంద్రుల కలయిక కారణంగా శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అది కూడా గజకేసరి రాజయోగం ఒకే రాశిలో రెండుసార్లు ఏర్పడబోతుంది. దీని వలన కొంతమంది జీవితాల్లో అతిగొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2026లో, జనవరి 3న ముందుగా మిథున రాశిలోకి మనస్సు కారకుడైన చంద్రుడు ఆ తర్వత జనవరి 30న మరొ సారి ఆ రాశిలోకి ప్రవేశించనుంది. ఇక్కడ, బృహస్పతితో కలిసి, కొత్త యేడాది మొదటి నెలలో డబుల్ గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఐదు రాశుల వారి జీవితాల్లో సానుకూల ఫలితాలతో పాటు అదృష్టం మారబోతుంది.
కర్కాటక రాశి.. 2026 ప్రారంభంలో ఏర్పడే శక్తివంతమైన గజకేసరి రాజయోగం కర్కాటక రాశి వారి కెరీర్ కొత్త పుంతలు తొక్కబోతుంది. ఈ రాశి వారికి కెరీర్‌లో పురోగతి ఉండబోతుంది. అలాగే వ్యక్తిగత జీవితంలో ఆహ్లాదకరమైన సమయాన్ని తీసుకురాబోతుంది. మీ కృషికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది.వ్యాపారవేత్తలు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మేధో సామర్థ్యం నుండి బంపర్ ఆదాయాన్ని పొందుతారు.
మేష రాశి.. కొత్త యేడాది ప్రారంభంలోనే ఏర్పడే గజకేసరి రాజయోగం ఈ రాశులకు మంచి శుభారంభాన్ని ఇవ్వబోతుంది. తమ కెరీర్‌ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది స్వర్ణ యుగం అని చెప్పాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం అని చెప్పాలి.
వృషభ రాశి.. జనవరి 2026లో డబుల్ గజకేసరి రాజయోగం కారణంగా వృషభ రాశి వారు అనేక ప్రయోజనాలు అందుకోబోతున్నారు. అన్ని విధాలుగా శభ ఫలితాలను అందుకుంటారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీ చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఇది. ఆర్థిక పరంగా శాంతి ఉండబోతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుండి మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు.
మకర రాశి..మకర రాశి వారి జీవితాల్లో గజకేసరి రాజయోగం అపారమైన కీర్తి తో పాటు విజయాన్ని తీసుకురాబోతుంది. ఉద్యోగ విషయాలలో మీరు చాలా సానుకూల ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ఇద సమయం. మీరు వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను అమాంతం పెంచనున్నాయి.
మిథున రాశి.. 2026 లో మీ స్వంత రాశి మిథున రాశిలో ఏర్పడే డబుల్ గజకేసరి రాజయోగం మిథున రాశి వారికి అష్టైశ్వార్యాలను తీసుకురాబోతుంది. అడుగడుగునా అదృష్టం మీ వెంట ఉంటుంది. జీవితంలో సానుకూలత పెరుగుతుంది. మీ స్వంత ఇంటి కల నెరవేరుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
గమనిక: ప్రియమైన పాఠకులారా, ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్యులు, పండితులు చెప్పిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.