Gajalakshmi Raja yoga effect: గురుడు, శుక్రుడు గ్రహాల కలయిక వల్ల గజ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే.. ఈ కాలంలో వీరు చేసిన ప్రతిపనిలో కూడా విజయాలు సిద్దిస్తాయి.
జ్యోతిష్య పండితులు ప్రకారం.. గజ లక్ష్మీ రాజయోగం అనేది చాలా శక్తివంతమైన యోగం. ఇది అత్యంత అరుదుగా ఏర్పడుతుంది. ముఖ్యంగా గురుడు మనిషి జీవితంలో కీలక మార్పుల్ని తీసుకొని వస్తాడు. విఘ్నాలు అన్ని దూరమౌతాయి. ధన సంపద కల్గుతుంది. ఈ యోగం అనేది మే22 గురువారం రోజున ఏర్పడబోతుంది.
శక్తివంతమైన ఈ యోగం వల్ల అప్పటి వరకు ఆగిపోయిన పనులన్ని కూడా జెట్ స్పీడ్ తో పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో గజ లక్ష్మీ రాజయోగం వల్ల మూడు రాశులు అనుకొని విధంగా ధనలాభంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందనున్నాయి.
గజ లక్ష్మీ రాజయోగం వల్ల మిథునం రాశి వారు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్ని సకాలంలో పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. విదేశీ యానానికి అవకాశం ఉంది. మీ సొదరులనుంచి శుభవార్తలు వింటారు.
సింహా రాశి వారికి ముఖ్యంగా కొనుగోలు లావాదేవీల్లో రాణిస్తారు. బిజినెస్ అనేది లాభలబాటపట్టి, జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవితంలో స్థిరపడతారు.
వృశ్చిక రాశి వారికి ఈ యోగం వల్ల విదేశీయానానికి చాన్స్ కన్పిస్తుంది. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. భార్యతరపు ఆస్తులు మీ సొంతమౌతాయి. మీకు ఉన్నటు వంటి అప్పులు అన్నితీరిపోయి.. జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు మీ సొంతమౌతాయి.