Add Zee Business As A Preferred Source
App

Schools Holiday: విద్యార్థులకు బంపర్ శుభవార్త.. సెప్టెంబర్ 5, 6,7న అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. ఎందుకో తెలుసా..?

Written ByInamdar Paresh
Published: Sep 03, 2025, 06:49 PM IST|Updated: Sep 03, 2025, 06:55 PM IST

Schools and Colleges Holiday news: విద్యార్థులకు వరుసగా హలీడేలు వస్తుండటంతో ప్రస్తుతం వారంతా సంబరాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి వీకెండ్ లో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Ganesh immersion:1/6

రేవంత్ రెడ్డి ప్రభుత్వం:

దేశ వ్యాప్తంగా గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఇప్పటికే గణేష్ నిమజ్జనాల్ని చేస్తున్నారు. కొంత మంది తమ ఇళ్లలో 1 రోజు, 3, 5, 9, ఈ విధంగా వినాయకుడి ప్రతిమల్ని పెట్టుకుంటారు. ఆతర్వాత నిమజ్జనం చేస్తారు. ఈ క్రమంలో తెలంగాణలో సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనంను నిర్వహించుకుంటున్నారు.  

school and colleges bandh:2/6

గణేష్ నిమజ్జనం వేడుకలు:

గణపయ్య నిమజ్జనం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లు,కాలేజీలు, ప్రభుత్వ కార్యలయాలకు సెప్టెంబర్ 6న సాధారణ సెలవుగా ప్రకటిస్తు హలీడే ఇచ్చింది.  అంతే కాకుండా..సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ పండగ కావడంతో రాష్ట్రమంతట సెలవు ఉంటుంది. 6న నిమజ్జనం నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో బంద్, ఆ తర్వాత  రోజు ఆదివారం కావడంతో మూడు రోజుల పాటు కంటీన్యూగా సెలవులు వచ్చినట్లు అయ్యింది.  

TG govt:3/6

గణేష్ నిమజ్జనం:

ముఖ్యంగా జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి రంగారెడ్డి జిల్లాల పరిధిలో అన్నిస్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు అప్లికేబుల్ అవుతుందని తెలంగాన ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు అక్టోబర్ 11 రెండో శనివారంను పనిదినంగా పరిగణిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో.. వినాయక నిమజ్జనంకు  జంట నగరాల పరిధిలోని చెరువులు, హైదరాబాద్ లోని హుస్సెన్ సాగర్ వద్ద ప్రత్యేంగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.  

school holiday news:4/6

స్కూళ్లు, కాలేజీలు బంద్:

హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలు భాగ్యనగర్ లో జరిగే నిమజ్జనం శోభాయాత్రను చూసేందుకు భారీగా తరలి వస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీగా కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు.  

Hyderabad:5/6

హైదరాబాద్:

ఇటీవల దేశ వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఇప్పటికి కూడా వానలకు పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నారు. ఆయా చోట్ల ఇప్పుటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. అక్కడ స్కూళ్లకూ కూడా తరచుగా సెలవుల్ని ఇస్తున్నారు.   

school holiday news:6/6

తెలంగాణ ప్రభుత్వం:

మరోవైపు వరుసగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కూల్ యాజమాన్యాలకు తమ పిల్లలపై సిలబస్ ప్రభావం ఉంటుందని గగ్గొలు పెడుతున్నారు. ఏది ఏమైన పిల్లలు మాత్రం వరుస సెలవులతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.