Garuda Purana Warning: హిందూ మతంలో ముఖ్యమైన గ్రంథాలలో గరుడ పురాణం ఒకటి. మనుషులు చేసిన పాప కర్మలు, పుణ్య ఫలాల ఆధారంగా కర్మల ఆధారంగా వచ్చే జన్మ ఎలా ఉంటుందో గరుడ పురాణంలో స్పష్టంగా ఉంటుంది. ఇందులో మానవ జన్మ చాలా అరుదైనదని.. విలువైనదిగా పరిగణించారు. మానవ జన్మలో చేసిన తప్పుల ప్రకారం.. వచ్చే జన్మలో జంతువుగా లేదా పక్షులుగా పుడతారని గరుడ పురాణం చెబుతోంది. మనిషి పొరపాటున కూడా చేయకూడని ఐదు తప్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
1/5స్నేహితుడిని మోసం చేస్తే.. గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మలో రాబందుగా పుడతాడు. రాబందు చనిపోయిన జీవుల మాంసాన్ని తింటుంది. ఇది ద్రోహం చేసిన వారికి విధించే శిక్ష.
2/5గరుడ పురాణం ప్రకారం.. మతాన్ని, వేదాలను, పురాణాలను లేదా దేవుడిని అగౌరవపరిచిన వారు తదుపరి జన్మలో కుక్కలుగా పుడతారని ప్రస్తావించారు. కుక్క జన్మలో వారు చాలా కష్టాలను ఎదుర్కొంటారని అందులో పేర్కొన్నారు.
3/5తన తెలివితేటలను ఉపయోగించి ఇతరులను మోసం చేసే వ్యక్తి వచ్చే జన్మలో గుడ్లగూబగా పుడతాడని గరుడ పురాణంలో చెప్పారు. ఈ జన్మ చీకటి, గందరగోళం, అజ్ఞానానికి చిహ్నం అని చెబుతారు.
4/5గరుడ పురాణం ప్రకారం.. తన మాటలతో ఇతరులను బాధ పెట్టకూడదు లేదా దుర్భాషను ఉపయోగించకూడదు. ఇతరులను తిట్టే లేదా అవమానించే వ్యక్తులు వారి తదుపరి జన్మలో మేకలుగా పుడతారని అందులో పేర్కొన్నారు.
5/5స్త్రీలను అవమానించే లేదా చెడు ఉద్దేశంతో చూసే పురుషులు వచ్చే జన్మలో పాము లేదా బల్లిలా పాకే జీవిగా పుడతారని గరుడ పురాణంలో చెప్పారు. లైంగిక కోరికలో మునిగిపోయి అధోగతి పాలైనందుకు సరైన శిక్ష అని చెబుతారు. (గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS ధృవీకరించలేదు.)