Add Zee Business As A Preferred Source
App

Nandu: భార్య డబ్బుల మీద బతుకుతున్నావని అన్నారు.. స్టార్ సింగర్ భర్త సంచలన కామెంట్స్ వైరల్..!

Written ByAruna Maharaju
Published: Dec 03, 2025, 12:51 PM IST|Updated: Dec 03, 2025, 12:51 PM IST

Actor Nandu: నందు.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా చేయడంతో పాటు..  ఐపీఎల్ లో హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. 2014లో నందు, సింగర్ గీతామాధురి ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో నందు తన భార్య గురించి.. అలాగే టీవీలోకి ఎందుకు వచ్చాడో చెబుతూ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. 
 

1/5

నందు హీరోగా నటించిన సైక్ సిద్దార్థ్ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో  నందు మాట్లాడుతూ.. నేను నా భార్య గీతా మాధురి డబ్బుల మీద బతుకుతున్నాను అన్నారు. ఇంక అలాంటి మాటలు చాలా విన్నాను. ఇదంతా విన్నప్పుడు చాలా హర్టింగ్ గా ఉంటుందంటూ బాధపడ్డాడు నందు. 

2/5

నేను ఒక సినిమా చేసి ఎంత సంపాదిస్తానో.. గీతా కూడా ఒక అయిదారు షోలు చేసి అంతే సంపాదిస్తుంది. అయితే నా సినిమా వచ్చి వెళ్లిపోతుంది.. తను చేసిన షోలు ఒకసారి షూటింగ్ చేస్తే మూడు నెలలు అంతా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది.   

3/5

ఇక టీవీలో గీతా మాధురి ఎక్కువ కనపడటంతో జనాలు అలా అనుకుంటారు. ప్రతి ఒక్కరు సొంత గుర్తింపు ఉండాలి అనుకుంటారు.. నేను కూడా అలాగే అనుకున్నాను. తను ఎంత పనిచేస్తుందో నేను అంతే పనిచేస్తున్నాను.. మరి ఎందుకు ఇలా అనుకునేవాడిని. నా సినిమా ఒక ఏడాది కష్టపడి చేస్తే.. ఒక షోతో నా ఫేట్ డిసైడ్ అయిపోతుంది. 

4/5

కానీ గీత ఎక్కువ ఎపిసోడ్స్ లో కనిపిస్తుంది కాబట్టి తను ఎక్కువ సక్సెస్ అనుకుంటారు జనాలు. నాకు కూడా టీవీ ఛాన్సులు చాలా వచ్చాయి కానీ వదులుకున్నాను. నా చుట్టూ ఉండే కొంతమంది జనాలు నువ్వు తోపు, హీరో అన్నారు. నాకు రియాలిటీ లేట్ గా తెలిసింది. మనకి మనం నిలబడాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అనుకున్నాను. 

5/5

మల్లెమాల నుంచి మొదట శ్రీదేవి డ్రామా కంపెనీకి, ఢీ లో మెంటర్ కింద అడిగారు. అప్పుడు ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. కానీ తర్వాత ఢీ కి యాంకర్ గా అడిగారు. ఇప్పుడు జనాలకు నేను ఎక్కువగా తెలుసు. ఐపీఎల్ తో మరింత ప్రజలకు క్లోజ్ అయ్యాను. జనాలకు ఎంత ఎక్కువ కనిపిస్తే అంత క్లోజ్ తీసుకుంటారు. అయితే టీవీ నుంచి వచ్చే డబ్బులతో నా ఫ్యామిలీని నడుపుకుంటూ.. అందులోనే కొంత దాచుకొని ఈ సినిమా తీసాను అని నందు తెలిపాడు.