Add Zee Business As A Preferred Source
App

Gold Discount: మార్కెట్‌ ధర కంటే 30 శాతం తక్కువ ధరకే బంగారం.. ఎలానో తెలుసా?

Published: Sep 26, 2025, 06:40 PM IST|Updated: Sep 26, 2025, 06:40 PM IST

Get 30 Percent Discount On Gold: రెండు లక్షల రూపాయలకు చేరువవుతున్న బంగారం ధర చూసి షాకవుతున్నారా? అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న బంగారం ధర నేపథ్యంలో కొన్ని చిట్కాలు పాటిస్తే అతి తక్కువకే బంగారం కొనవచ్చు. మార్కెట్‌ ధర కన్నా తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఎలానో తెలుసుకుందాం.

1/5

తక్కువ ధరకే బంగారం ఎక్కడ లభిస్తుందోనని కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా బంగారం ధర భారీగా ఉంది. ప్రస్తుతం బంగారం లక్షా 16 వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనాలంటే మన పొదుపును మొత్తం వెచ్చించాల్సిందే. అయితే పండుగల నేపథ్యంలో బంగారం ధర తక్కువకు కొనుగోలు చేసే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

2/5

మార్కెట్‌లో ఉన్న ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దానికి మనం ఈ కామర్స్‌ సైట్‌లలో బంగారం కొనుగోలు చేయాలి. ప్రస్తుతం ఈ కామర్స్‌ సైట్‌లు భారీ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెస్టివల్ పేరిట భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి. 

3/5

సంవత్సరం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆన్‌లైన్ డిస్కౌంట్ సేల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రాతోపాటు అనేక ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు, యాప్‌లు అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.  

4/5

ఈ కామర్స్‌ సైట్‌లలో ప్రస్తుతం అన్ని వస్తువులు 50 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గింపు లభ్యమవుతున్నాయి. దుస్తులు, సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతోపాటు బంగారం కూడా డిస్కౌంట్‌ఆకర్షణీయంగా ఉంది.  

5/5

ఈ ఆన్‌లైన్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ ప్రస్తుతం బంగారంపై 29 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో ఈ కామర్స్‌ సంస్థలు అందిస్తున్న ఈ ఆఫర్‌తో బంగారం తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఆన్‌లైన్ సేల్‌లో బంగారం మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఇక్కడ అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించడం లేదు.