Add Zee Business As A Preferred Source
App

iPhone 17 Proపై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ ఆర్డర్స్‌.. రూ.64,900కే మీ సొంతం.. ఇలా ఎలా?

Published: Sep 11, 2025, 12:49 PM IST|Updated: Sep 11, 2025, 12:49 PM IST

Apple iPhone 17 Pro Low Price: ఫ్లిప్‌కార్ట్‌లో Apple iPhone 17 Pro స్మార్ట్‌ఫోన్‌పై ప్రీ ఆర్డర్స్‌ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా కొన్ని ఆఫర్స్‌ కూడా ప్రత్యేక్షమయ్యాయి. అలాగే ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులోకి రాబోతోంది. దీంతో ఈ మొబైల్‌ చీప్‌ ధరకే లభించనుంది. 

Apple iPhone 17 Pro Low Price: అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Apple iPhone 17 సిరీస్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సిరీస్‌ను కంపెనీ సెప్టెంబర్ 9, 2025న అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మొబైల్స్‌ అన్ని అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే కొన్ని ఈ కామర్స్‌ కంపెనీలు ఈ కొత్త యాపిల్‌ సిరీస్‌ మొబైల్స్‌పై ప్రీ ఆర్డర్‌లను కూడి ప్రకటించాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కాబోతోంది. అలాగే ఇదే రోజు ఫ్లిప్‌కార్ట్‌ ఈ సిరీస్‌ మొబైల్స్‌ను కూడా ప్రకటించే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది..

Iphone 17 Pro Max 1/7

Apple iPhone 17 Pro స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Apple iPhone 17 Pro స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Iphone 17 Pro Max Apple2/7

డిస్‌ప్లే

ఈ Apple iPhone 17 Pro స్మార్ట్‌ఫోన్‌ కొత్త A19 ప్రో చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా స్పెషల్  గ్రాఫిక్స్‌తో పాటు AI ఫంక్షన్‌లలో విడుదలైంది. ఇక ఇది 6.9 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో పాటు 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది.   

Apple Iphone 17 Price3/7

సెంట్రల్ స్టేజ్ కెమెరా

ఈ మొబైల్ బ్యాక్‌ సెటప్‌లో త్రిపుల్‌ కెమెరాల మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరాలు 48MP ఫ్యూజన్ సెటప్ (మెయిన్, అల్ట్రా వైడ్, టెలిఫోటో)తో పాటు టెలిఫోటో లెన్స్ 8x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో విడుదల కానుంది. అలాగే ఫ్రంట్‌ కెమెరా 18MP సెంట్రల్ స్టేజ్ కెమెరాతో విడుదలైంది.

Iphone 17 Pro Price 4/7

ప్రధాన కెమెరా

Iphone 17 Pro Price In India5/7

ఆపరేటింగ్ సిస్టమ్‌తో

ఇక ఈ ఐఫోన్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు కొత్త Apple Intelligence AI ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఇది మొత్తం మూడు (కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్ రంగుల) రంగులో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది.  

Iphone 17 Price In India6/7

మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌

ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ (256 GB స్టోరేజ్‌ ఆప్షన్‌) ధర రూ.1,34,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ప్రీ బుకింగ్‌లో భాగంగా బుక్‌ చేసుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌ తమ అనుసంధాన యాక్సిస్, SBI బ్యాంక్ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో ఇది రూ.1,28,153కే పొందవచ్చు.   

Iphone Iphone 177/7

ఫ్లిప్‌కార్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌లో Apple iPhone 17 Pro స్మార్ట్‌ఫోన్‌పై త్వరలోనే ఎక్చేంజ్‌ బోనస్‌ ఆఫర్‌ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎదైన పాత యాపిల్ లేదా సాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను ఎక్చేంజ్ చేసేవారికి ఏకంగా రూ.70,000 వరుకు బోనస్‌ లభించే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.64,900కే ఈ మొబైల్ కొనుగోలు చేయోచ్చు..