Add Zee Business As A Preferred Source
App

Jobs: పది పాసైతే చాలు లక్షల్లో జీతం.. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన సూపర్ కోర్సులు మీకోసం..!!

Written ByBhoomi
Published: Aug 24, 2025, 10:36 AM IST|Updated: Aug 24, 2025, 10:36 AM IST

Career Advice: యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సరికొత్త స్కీములను తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా యువత కోసం ప్రత్యేక కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పదవ తరగతి పాసైన తర్వాత లక్షల్లో జీతం అందుకునే కొన్ని సూపర్ కోర్సులను తీసువచ్చింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Telangana government training program1/8

ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు

సాధారణంగా చాలా మంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు అనగానే బీటెక్, ఎంటెక్ లేదా విదేశీ చదువులు అవసరం అని అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ అభిప్రాయాన్ని పూర్తి మార్చేస్తోందని చెప్పవచ్చు. ఇప్పుడు పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు కూడా లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలకు అర్హులు అవుతున్నారు.   

Telangana government training program2/8

పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యా

రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలను కల్పించేందుకు అత్యాధునిక కోర్సులను అందుబాటులోకి తీసువచ్చింది. ఈ కోర్సుల కోసం ప్రభుత్వం టాటా గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రప్రభుత్వం, టాటా గ్రూప్ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశారు.   

Telangana government training program3/8

రూ. 5వేల కోట్ల భారీ బడ్జెట్

ఈ సెంటర్ల కోసం రూ. 5వేల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. అంటే తెలంగాణ యువతకు భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు  వేసిన ముందడగు ఇది అని చెప్పవచ్చు ఈ సెంటర్లలో ఆరు ప్రపంచస్థాయి కోర్సులను అందిస్తున్నారు. పది పాస్ అయిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనింగ్ ను టాటా మాస్టర్ ట్రైనర్లు, ప్రభుత్వ ఐటీఐ ఆఫీసర్లు అందిస్తారు. 

Telangana government training program4/8

నూతన యంత్రాలతో ప్రత్యక్ష ప్రాక్టికల్

విద్యార్థులకు నూతన యంత్రాలతో ప్రత్యక్ష ప్రాక్టికల్ ట్రైనింగ్ లభిస్తుంది. కేవలం థియరీ కాకుండా నేరుగా ఉద్యోగాలకు ఉపయోగపడే నైపుణ్యాలను నేర్పించడం ఈ కోర్సుల ప్రధాన బలం అని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే కోర్సు సమయంలోనే ఆన్ జాబ్ ట్రైనింగ్, స్టైఫండ్, అప్రెంటీషిప్ లభిస్తాయి. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత  ప్రముఖ పరిశ్రమల్లో వంద శాతం ప్లేస్ మెంట్ హామీ కూడా ఇస్తున్నారు. 

Telangana government training program5/8

రెండేళ్ల కోర్సుల్లో అడ్వాన్స్‌డ్

రెండేళ్ల కోర్సుల్లో అడ్వాన్స్‌డ్ CNC మెషినింగ్ టెక్నీషియన్ ఉంది. ఇందులో CNC మెషిన్ల ఆపరేషన్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్  వంటి  కోర్సులు నేర్పిస్తారు. తయారీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి కాబట్టి  మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులో టూ వీలర్ల నుంచి హెవీ వాహనాల వరకు అసెంబ్లింగ్, రిపేర్, ట్రబుల్‌షూటింగ్ లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. 

Telangana government training program6/8

 భవిష్యత్తు EV రంగం

 భవిష్యత్తు EV రంగంలో మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది.  బేసిక్ డిజైనర్ & వర్చువల్ వెరిఫయర్ కోర్సు B.Tech స్థాయి స్థాయిలో ఉంటుంది. వీటితోపాటు ANSYS, CAE సాఫ్ట్‌వేర్‌లతో డిజైనింగ్ నేర్పిస్తారు. ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఈ కోర్సుకు పెద్ద డిమాండ్ ఉండటంతో ఆయా రంగాల్లో రాణించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సులను ఎంపిక చేశారు. 

Telangana government training program7/8

ఆకర్షణీయమైన అవకాశాలు

ఏడాది  కోర్సుల్లో కూడా ఆకర్షణీయమైన అవకాశాలు ఉన్నాయి. ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్లో 3D ప్రింటింగ్, CAD/CAM, CNC మిల్లింగ్ వంటి స్కీల్స్ కూడా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్, ఆర్కిటెక్చర్, టెక్స్‌టైల్, ఎయిరోస్పేస్ రంగాల్లోనూ  వీటికి మంచి డిమాండ్ ఉంది. అలాగే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ కోర్సు ద్వారా రోబోటిక్ మెషిన్ల ప్రోగ్రామింగ్, ఆటోమేషన్ ను కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు.  మరో కోర్సు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ & ఆటోమేషన్ కూడా ఉంది. ఇందులో PLC, SCADA, HMI సాఫ్ట్‌వేర్‌లపై ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే  వీటికి ఆహార, ప్యాకేజింగ్ రంగాల్లో భారీ డిమాండ్ ఉందని చెప్పవచ్చు.   

Telangana government training program8/8

ఆగస్టు 28వ తేదీ వరకు దరఖాస్తులు

కాగా ఈ కోర్సుల కోసం అడ్మిషన్లు ఇప్పటికే షురూ అయ్యాయి. ఆగస్టు 28వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవల్సి ఉంటుంది.  మరిన్ని వివరాల కోసం  08069434343 నెంబరుకు కాల్ చేయవచ్చు లేదంటే వాట్సాప్‌లో 9703331914 ద్వారా కూడా సంప్రదించి వివరాలను తెలుసుకోవచ్చు.