iPhone 16 Pro Price Cut: ఐఫోన్ 16 ప్రోని కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్లో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్‌తో పాటు అన్ని ఆఫర్స్ ఫోన్ మొబైల్ కేవలం రూ.28,999కే లభిస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకోండి.
iPhone 16 Pro Price Cut: ఐఫోన్ కొనాలని ఎవరనుకోరు.. అందరూ కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ వీటి ధరలను చూసే కొనకుండా ఆగిపోతూ ఉంటారు. ముఖ్యంగా నేటి యువత అయితే చాలావరకు ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సిరీస్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే యాపిల్‌కు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. అత్యంత ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి వచ్చే యాపిల్ మొబైల్స్ ధరలు కూడా భారీగానే ఉంటాయి.
1/5ఇటీవల యాపిల్ కంపెనీ 17 సిరీస్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో గత 16 సిరీస్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రూ.1,20,000 మొబైల్స్ కూడా రూ.86,000 లభించబోతున్నాయి. ముఖ్యంగా యాపిల్ 16 అత్యంత చీప్ ధరకే లభించబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో? ఎంత తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
2/5ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన కెమెరా కంట్రోల్ బటన్ కూడా లభిస్తుంది. అలాగే దీని బ్యాక్ సెటప్ లో 48-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన టెలిఫోటో లెన్స్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి.
3/5ఇక యాపిల్ 16 ప్రో మొబైల్ కొత్త A18 ప్రో చిప్‌తో పని చేస్తుంది. ఇది గత మోడల్ కంటే అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇందులో Wi-Fi 7 టెక్నాలజీ ఉంది. ఇది iOS 18తో పాటు వచ్చిన 'యాపిల్ ఇంటెలిజెన్స్' ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
4/5ఈ మొబైల్‌ను అత్యంత చీప్ ధరకే పొందాలనుకునే వారు బిగ్ బిలియన్ సేల్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ వెల్లడించిన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకారం కేవలం రూ.69,999 కే ఈ మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపు ధరతో కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది.
5/5ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత చీప్ ధరకు పొందడానికి.. ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర ఉన్న పాత యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు రూ.41,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ ను మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. రూ.28, 999కే ఈ మొబైల్స్ సొంతం చేసుకోవచ్చు.