iQOO 13 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో iQOO మార్కెట్లోకి విడుదల చేసిన ఓ స్మార్ట్ ఫోన్ అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
iQOO 13 5G Price Cut: ఆన్లైన్‌లో మంచి మొబైల్స్ కొనుగోలు చేయాలని వారికి ఇది అద్భుతమైన శుభవార్త.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ పై అద్భుతమైన సేల్స్‌ను నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఈ సేల్స్‌లో భాగంగా iQOO 13 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ మధ్య లభిస్తుంది. ముఖ్యంగా హై ఎండ్ ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ అతి తక్కువ ధరతో లభించడంతో చాలామంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు..
1/6ముఖ్యంగా ఆమెజాన్ అందిస్తున్న సేల్ డిస్కౌంట్ ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..iQOO 13 5G స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.61,999గా ఉన్నప్పటికీ, అమెజాన్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌తో రూ.54,999కే లభిస్తోంది. అంటే ఇప్పుడే అమెజాన్లో కొనుగోలు చేసే వారికి దాదాపు రూ.7,000 ఆదా చేసుకోవచ్చు.
2/6ఈ iQOO 13 5G స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి పేమెంట్ చేస్తే ఏకంగా అదనంగా రూ.1600 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
3/6అలాగే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో మీరు ఏదైనా పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల భారీ తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ చేసే పాత మోడల్ మొబైల్ ను బట్టి దాదాపు గరిష్ఠంగా రూ.42,350 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుందని అమెజాన్ పేర్కొంది.
4/6ఈ బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు అన్ని రకాల ఆఫర్స్‌ను కలుపుకొని ఈ iQOO 13 5G మొబైల్‌ను చీపుధరకే కొనుగోలు చేయొచ్చు.. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించేవారు గరిష్ట ఎక్స్చేంజ్ బోనస్ పోను iQOO 13 5G ఫోన్‌ను కేవలం రూ.12,649కే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ మొబైల్ ను మరింత తగ్గింపు ధరకు పొందాలనుకుంటే ఇతర ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు.
5/6ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ పైనే కాకుండా.. iQOO 13 5G మొబైల్‌తో పాటు, iQOO నియో, iQOO Z సిరీస్ ఫోన్‌లపై కూడా భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీటిని కూడా చీప్ ధరకు పొందడానికి ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది..
6/6నోట్: ఎక్స్చేంజ్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు అన్ని స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసే సమయంలో ఈ కామర్స్ వెబ్సైట్ నిబంధనలకు లోబడి ఉంటాయి. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ధరలు పెరగడమే కాకుండా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కస్టమర్లు వీటిని కొనుగోలు చేసే సమయంలో ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.