Add Zee Business As A Preferred Source
App

Motorola Edge 50 Fusion Price: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.599లోపే Motorola 5G స్మార్ట్‌ఫోన్‌ పొందండి..

Published: Aug 17, 2025, 01:10 PM IST|Updated: Aug 17, 2025, 01:10 PM IST

Motorola Edge 50 Fusion Price: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తగ్గింపుతో లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి భారీ ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుకుందాం..

Motorola Edge 50 Fusion Price Cut: ఎప్పటి నుంచో అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో Motorola బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్స్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. గతంలో లాంచ్‌ అయిన Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ డెడ్ చీప్‌ ధరకే అందుబాటులో ఉంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Motorola Edge 50 Fusion Mobile1/6

డిస్ప్లే

ఈ Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ 6.7-అంగుళాల Full HD+ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్క్రీన్‌ 2400 x 1080 పిక్సెల్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది pOLED ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లేతో వస్తోంది. ఇక ప్రొటెక్షన్ కోసం కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సెటప్‌ను కూడా అందిస్తోంది.  

Motorola 50 Edge Fusion2/6

చిప్‌సెట్

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది ప్రత్యేకమైన Adreno 710 GPUను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో పాటు 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.  

50 Motorola Edge Fusion3/6

ప్రధాన కెమెరా..

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో OIS - ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు అదనంగా 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ప్రత్యేకమైన 32MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.  

Edge 50 Fusion4/6

బేస్‌ వేరియంట్‌

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ బేస్‌ వేరియంట్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. మార్కెట్‌లో 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రూ.25,999గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 26 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది రూ.18,999కే లభిస్తోంది.  

Motorola Moto Edge 50 Fusion5/6

క్రెడిట్ కార్డ్‌

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్రీడమ్‌ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.. ఇందులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ Axis Bank క్రెడిట్ కార్డ్‌ వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక మరింత తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా వినియోగించవచ్చు. 

Motorola Edge6/6

డిస్కౌంట్‌ ఆఫర్స్‌

ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా మంచి బ్రాండ్‌కు సంబంధించిన పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.18,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్ రూ.599కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.