Oppo K13x 5G Price Cut: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Oppo K13x 5G స్మార్ట్ ఫోన్ అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎన్నో రకాల ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ప్రత్యేకమైన ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo K13x 5G Price Cut: ప్రస్తుతం మార్కెట్లో AI ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌కి అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్ లో AI ఫీచర్స్ ఉండడం తప్పనిసరిగా మారింది.. అయితే ఇప్పుడు మిడిల్ రేంజ్ మొబైల్స్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్ వస్తున్నాయి. చాలామంది ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు.. మీరు కూడా మంచి AI ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.
1/8ఎప్పటినుంచో అత్యంత తక్కువ ధరలోనే AI ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన మొబైల్ Oppo K13x 5G.. ఈ మొబైల్ ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు అనేక రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2/8ఈ Oppo K13x 5G స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో పాటు ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్నెస్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో స్ప్లాష్ టచ్ టెక్నాలజీ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
3/8ఇక ఈ Oppo K13x 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లభిస్తోంది. అంతేకాకుండా Android 15 ఆధారంగా ColorOS 15 ఆపరేటింగ్ సిస్టంపై అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఫీచర్‌తో వచ్చింది.
4/8ఈ Oppo K13x 5G మొబైల్‌కు సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్ సెటప్‌లో ఎంతో శక్తివంతమైన 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తుంది. ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
5/8ఈ మొబైల్‌కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇందులో కంపెనీ ప్రత్యేకమైన AI ఎరేజర్, AI అన్‌బ్లర్, AI రిఫ్లెక్షన్ రిమూవర్ వంటి AI ఫీచర్స్ ను అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
6/8ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియెంట్ 4GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర రూ.11,999తో లభిస్తోంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర రూ.12,999తో.. మూడవ స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999తో అందుబాటులో ఉంది.
7/8ఇక ఈ Oppo K13x 5G మొబైల్‌కు సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ బేస్ వేరియంట్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. మార్కెట్లో దీని ధర రూ.15,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా.. 25 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,999కే పొందవచ్చు. అలాగే మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
8/8ఈ Oppo K13x 5G మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే.. రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఏదైనా మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేసి కొనుగోలు చేసే వారికి రూ.7,000 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్ అన్ని పోను కేవలం రూ.4,349కే పొందవచ్చు.