POCO M7 Plus 5G Price: మొదటి సేల్‌లో భాగంగా POCO M7 Plus 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.1,199కే లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎన్నో రకాల స్పెషల్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
POCO M7 Plus 5G Price Cut: ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను చీప్ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ నెలలో మార్కెట్‌లోకి వచ్చిన POCO M7 Plus 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే ఛీప్ ధరకే పొందవచ్చు. అయితే దీనికి సంబంధించిన మొదటి సేల్ ఆగస్టు 19న ప్రారంభమైంది. ఇది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా చీప్ ధరకే అందుబాటులో ఉంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1/6మొదటి సేల్‌లో భాగంగా POCO M7 Plus 5G ఫోన్ చీప్ ధరకే పొందవచ్చు.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులో వచ్చింది. ఇది 7000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే ప్రత్యేకమైన Android 15 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
2/6ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇది 6GB + 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో పాటు 8GB + 256GB స్టోరేజ్‌తో లభిస్తోంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది.
3/6ఈ బేస్ వేరియంట్‌ను ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైన బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి పాత పోకో, రెడ్‌మీ, సాంసంగ్ బ్రాండ్‌లకు సంబంధించిన పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.13,800 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ బోనప్‌పై ప్రత్యేకమైన రూ.1 వేయి అదనపు డిస్కౌంట్ బోనస్‌ను అందిస్తోంది. ఇక ఈ ఆఫర్స్ అన్ని పోనూ.. స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.1,199కే పొందవచ్చు.
4/6ఈ పోకో M7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల HD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్‌తో విడుదలైంది. ఇందులో పోకో ప్రత్యేకమైన వర్చువల్ RAM సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
5/6ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన కెమెరా సెటప్‌తో విడుదలైంది. ఇది బ్యాక్ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాతో HD వీడియోలను కూడా రికార్ట్ చేసే సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే స్పెషల్ వీడియో కాలింగ్ సపోర్ట్ కోసం 8MP కెమెరాను కూడా అందిస్తోంది.
6/6ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన కెమెరాతో విడుదలైంది. ఇది 7000mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో సెక్యూరిటీ కోసం స్పెషల్‌గా ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల కనెక్టివిటీ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది.