Realme P4 Pro 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా Realme P4 Pro 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీనిపై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా అదనంగా ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Realme P4 Pro 5G Price Cut: ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్‌మీకి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్‌ను మార్కెట్‌లోకి ఎప్పుడు విడుదల చేస్తూ.. రావడం వల్ల చాలామంది వీటినే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అత్యంత చీప్ ధరలకే ఈ మొబైల్స్ లభించడం వల్ల ఎక్కువగా యువత కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా ఎప్పటినుంచో రియల్ మీ బ్రాండ్ లోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి సందర్భం..
1/7ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా రియల్ మీ బ్రాండ్ కు సంబంధించిన మొబైల్స్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వీటిపై అత్యధిక ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. అయితే ఈ సేల్‌లో భాగంగా ఏ మొబైల్ చీప్ ధరకు లభిస్తుందో? ఇప్పుడు తెలుసుకోండి.
2/7మార్కెట్‌లోకి గతంలో విడుదలైన Real me P4 Pro 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 (Qualcomm Snapdragon 7 Gen 4) చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా HyperVision AI చిప్‌తో అందుబాటులోకి వచ్చింది.
3/7ఇక ఈ మొబైల్ 6.8-అంగుళాల 4D కర్వ్+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్, 6500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇందులో ప్రత్యేకమైన కార్నిక్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే స్పెషల్ కెమెరా సెటప్ కూడా లభిస్తుంది.
4/7ఇక ఈ Real me P4 Pro 5G మొబైల్ బ్యాక్ కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh భారీ బ్యాటరీ, 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదలయింది.
5/7ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది మార్కెట్లో ధర రూ.28,999తో అందుబాటులో ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 21 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పోను కేవలం రూ.22,999కే ఈ మొబైల్ అందుబాటులో ఉంది.
6/7ఇక ఈ Real me P4 Pro 5G మొబైల్‌ను మరింత చీప్ ధరకే పొందాలనుకుంటే అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే.. గరిష్టంగా రూ.2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను రూ.20 వేల లోపే ఈ మొబైల్ పొందవచ్చు.
7/7ఇక మరింత డిస్కౌంట్ పొందాలనుకునేవారు ఎక్స్చేంజ్ బోనస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం ఏదైనా పాత స్మార్ట్ పోనూ ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.10 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను మొబైల్ ధర నుంచి తీసేస్తే.. దీనిని కేవలం రూ.10 వేలకే సొంతం చేసుకోవచ్చు..