Add Zee Business As A Preferred Source
App

Vivo T4x 5G: రూ.7 వేల లోపే వీవో T4x 5G మొబైల్‌.. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్స్‌ డేస్‌ బంఫర్‌ ఆఫర్!

Published: Sep 23, 2025, 10:38 PM IST|Updated: Sep 23, 2025, 10:38 PM IST

Vivo T4x 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో వీవో T4x 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. అలాగే దీనిపై ప్రత్యేకమైన ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Vivo T4x 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఎందుకంటే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వీవో అత్యంత చీప్‌ ధరలోనే ప్రీమియం మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది.. ఈ కంపెనీలోనే కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ ఇప్పుడు ప్రత్యేకమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Vivo T4X Flipkart1/6

వీవో

ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని వీవో(vivo) స్మార్ట్‌ఫోన్స్‌ అత్యంత తగ్గింపుతో లభిస్తోంది. ముఖ్యంగా వీవో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో చీప్‌ ధరకే అందుబాటులో ఉంది. అయితే, దీనిపై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ ఏంటో? ఫీచర్స్‌, ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Vivo T4X Price In India2/6

డిస్‌ప్లే

వీవో T4x 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది MediaTek Dimensity 7300 5G చిప్సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 1080 x 2408 పిక్సెల్స్‌తో విడుదలైంది.  

Vivo T4X 5G 3/6

బొకే కెమెరా

ఈ వీవో (vivo) T4x 5G మొబైల్‌ ఎంతో శక్తివంతమైన 6,500mAh భారీ బ్యాటరీతో విడుదలయ్యింది. దీంతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP బొకే కెమెరా అందుబాటులోకి వచ్చింది.  

Vivo T4X 5G 4/6

స్టోరేజ్ ఆప్షన్స్‌

వీవో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15తో అందుబాటులోకి వచ్చింది. ఇది మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో విడుదలైంది.  మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌తో పాటు 8GB ర్యామ్ + 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది.  

 Vivo T4X Launch Date5/6

వీవో T4x 5G మొబైల్‌

ఈ వీవో T4x 5G మొబైల్‌కి సంబంధించిన కనెక్టివటీ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 5G నెట్‌వర్క్ సపోర్ట్, Wi-Fi 6 సపోర్ట్, బ్లూటూత్ v5.4, USB టైప్-C పోర్ట్, డ్యూయల్ SIM సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రత్యేకమైన సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ధర భారత్‌లో దాదాపు రూ. 13,499 నుంచి ప్రారంభమవుతుంది.  

Vivo T4X Price6/6

రూ.10,150  వరకు ఎక్చేంజ్‌ బోనస్‌

భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.17,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్స్‌ డేస్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 25 శాతం తగ్గింపుతో కేవలం రూ.13,499కే లభిస్తోంది. అలాగే దీనిని బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి Flipkart SBI, Axis బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో పేమెంట్‌ చేసేవారికి 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. అలాగే పాత మొబైల్‌ ఎక్చేంజ్‌ చేసేవారికి రూ.10,150  వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. ఈ బోనస్‌ను ఫోన్‌ ధర నుంచి తీసేస్తే దాదాపు రూ.7,849కే దీనిని పొందవచ్చు..