Goji Berries Health Benefits in Telugu: ఎరుపు రంగులో ఉండే పండ్లు చూడగానే మనసును ఆకర్షిస్తాయి. వాటిలో ఒకటి గోజీ బెర్రీలు. ఈ చిన్న ఎరుపు పండ్లు ఆకారంలో ఈత పండ్లను పోలి ఉంటాయి. చాలామందికి వీటిని తినాలా వద్దా అనే సందేహం వస్తుంది. కానీ గోజీ బెర్రీలను తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిని “సూపర్ ఫుడ్”గా కూడా పిలుస్తారు. చైనీస్ సంప్రదాయ వైద్య విధానంలో గోజీ బెర్రీలు శరీరానికి అనేక రకాల లాభాలు ఇస్తాయని చెబుతుంటారు. అందుకే ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్నారు. ఇప్పుడు ఈ గోజీ బెర్రీలను తినడం వల్ల కలిగే ఆరోగ్యానికి కలిగించే ప్రధాన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1/7గోజీ బెర్రీలలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలిశాకరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లలో ముఖ్యమైనవని చెప్పవచ్చు. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను అడ్డుకోవడంలో ఇవి సహాయపడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోవడం వలన గుండె పోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
2/7ముఖ్యంగా, గోజీ బెర్రీలలో ఉండే జియాజాంతిన్ అనే పదార్థం కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇది UV కిరణాల నుంచి కళ్లను రక్షిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ముదురు శుక్లాలు (క్యాటరాక్ట్) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3/7ఈ పండ్లలో విటమిన్ A, C అధికంగా లభిస్తాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరిగి, శరీరం వైరస్‌లు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాబట్టి తరచూ అనారోగ్యానికి గురయ్యే వారు ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు.
4/7ఈ పండ్లు లివర్, కిడ్నీలను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. టాక్సిన్లు బయటకు పంపించి ఆయా అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్న వారికి గోజీ బెర్రీలు ప్రయోజనం కలిగిస్తాయి. శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఇవి సహాయపడతాయి.
5/7గోజీ బెర్రీలలో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. సూర్యరశ్మి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాలను అడ్డుకుంటాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గి, చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
6/728 గ్రాముల గోజీ బెర్రీలలో దాదాపు 98 క్యాలరీలు, 21 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3.6 గ్రాముల ఫైబర్, 4 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. అలాగే విటమిన్ A, C, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
గోజీ బెర్రీలు చాలా మందికి సురక్షితమే. అయితే రక్తాన్ని పలుచబెట్టే మందులు వాడేవారు, హైబీపీ ఉన్నవారు, అలర్జీలు ఉన్నవారు, గర్భిణీలు వీటిని తినకూడదు.