Add Zee Business As A Preferred Source
App

Gold Rate Today: బంగారానికి బరువెక్కువ.. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా?

Written ByBhoomi
Published: Oct 12, 2025, 08:46 AM IST|Updated: Oct 12, 2025, 08:46 AM IST

Gold Rate Today 10th October: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేనంత ఎత్తులో ఉన్నాయి. తాజాగా 
అక్టోబర్ 12వ తేదీ ఆదివారం నాడు బంగారం ధరలు మరో కొత్త రికార్డులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,090, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,300 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర కూడా అదే స్థాయిలో పెరుగుతూ, కిలోకు రూ. 1,67,144 వద్ద పలుకుతోంది. నిన్నటి ధరలతో పోల్చితే ఇవాళ బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడం గమనార్హం.
 

Trade pressures on China1/6

చైనాపై వాణిజ్య ఒత్తిళ్లు

బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న అస్థిరత, అమెరికా ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి, అలాగే చైనాపై వాణిజ్య ఒత్తిళ్లు బంగారం ధరలను గగనానికెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాపై కొత్త సుంకాలు విధించవచ్చని హెచ్చరించడం వలన వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ పెరిగాయి. 

Investing in gold2/6

బంగారంలో పెట్టుబడి

ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర $4000 దాటింది.ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెడుతున్న కొద్దీ, దేశీయంగా బంగారు ఆభరణాల కొనుగోలు తగ్గింది. 

Gold ETF Scheme3/6

గోల్డ్ ETF స్కీమ్‌

మధ్యతరగతి వర్గం బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తూ కొనుగోళ్లను వాయిదా వేస్తోంది. మరోవైపు, పసిడిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగి, గోల్డ్ ETF స్కీమ్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. పలు ఫైనాన్స్ సంస్థలు ఈ విభాగంలో కొత్త రికార్డులు నమోదవుతున్నట్లు వెల్లడిస్తున్నాయి.

Silver price increase4/6

వెండి ధరల పెరుగుదల

వెండి విషయానికి వస్తే.. ఈ లోహం ధర కూడా భారీ ఎత్తున పెరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టార్‌లో డిమాండ్ పెరగడం వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. 

Solar energy project5/6

సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు

సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఉపయోగించే సోలార్ ప్యానెల్స్ తయారీలో, అలాగే ఎలక్ట్రిక్ కార్ల తయారీలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీల వినియోగం వేగంగా పెరుగుతున్నందున, వెండి డిమాండ్ పెరిగి సరఫరా తగ్గింది. ఫలితంగా ధరలు ఆల్‌టైమ్ రికార్డ్ లెవెల్‌కి చేరుకున్నాయి.

Gold and silver prices6/6

పసిడి, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ధోరణి కొనసాగితే, పసిడి, వెండి ధరలు మరికొన్ని రోజులు ఎగువననే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడిదారులు దీర్ఘకాలిక దృష్టితో బంగారం, వెండి పెట్టుబడులపై ఆలోచన చేయవచ్చు.