Today Gold & Silver Rate: 90 వేల మార్క్‌కు చేరుతున్న పసిడి, ఇవాళ మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇలా

గతంలో ఎన్నడూ లేనంత భారీగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి సంచలనం సృష్టిస్తోంది. అప్పుడే 90 వేల మార్క్‌కు చేరుతోంది. ఇవాళ బంగారం, వెండి ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం, సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి. 

Today Gold & Silver Rate: గతంలో ఎన్నడూ లేనంత భారీగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి సంచలనం సృష్టిస్తోంది. అప్పుడే 90 వేల మార్క్‌కు చేరుతోంది. ఇవాళ బంగారం, వెండి ధరలు అత్యంత స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం, సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి. 
 

1 /6

2 /6

పసిడి ధర ప్రస్తుతం 90 వేల మార్క్‌కు చేరుతోంది. అటు వెండి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 1 లక్షా 10 వేలు దాటుతోంది. ఇవాళ మార్చ్ 18 ఉదయం  గంటలకు నమోదైన ధరల ప్రకారం బంగారం అత్యంత స్వల్పంగా కేవలం 10 రూపాయలు తగ్గగా వెండి కూడా అదే రీతిలో 100 రూపాయలు తగ్గింది. 

3 /6

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,240 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 89,700 రూపాయలు ఉంది. వెండి కిలో  1,02,800 రూపాయలు పలుకుతోంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,090 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,550 రూపాయలు ఉంది. కిలో వెండి 1 లక్షా 2 వేల 8 వందల రూపాయలు ఉంది. 

4 /6

ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,090 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,550 రూపాయలు ఉంది. చెన్నైలో కిలో వెండి 1,11,800 రూపాయలు ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,090 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,550 రూపాయలుగా ఉంది.  కిలో వెండి 1,02,800 రూపాయలుంది. 

5 /6

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,090 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,550రూపాయలుగా ఉంది. కిలో వెండి 1,11,800 రూపాయలు ఉంది. 

6 /6

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 82,090 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,550 రూపాయలు ఉంది. కిలో వెండి ఈ రెండు నగరాల్లో 1,11,800 రూపాయలు ఉంది.