Gold Investements: ప్రపంచదేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ధరలు అమాంతంగా పెరుగుతున్న బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదేనా? బంగారాన్ని ఆభరణాలకోసం కొంటున్నారా? పెట్టుబడులకోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారా? సామాన్యుడికి బంగారాన్ని కొనుగోలు అందని ద్రాక్షేనా? మధ్యతరగతి కుటుంబీకులు బంగారాన్ని ఎలా కొనుగోలు చేయగలుగుతున్నారు? ఎక్స్ పర్ట్స్ చెబుతున్న మాట ఇదే.
1/6అమెరికా ఆంక్షలు, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న ఒడిదుడుకులు, ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం అమాంతంగా పెరిగింది. ఊహించని విధంగా బంగారం ధరకు రెక్కలు రావడంతో మార్కెట్లో వ్యాపారులు, వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. గణనీయంగా పెరిగిన బంగారం ధర తగ్గిపోతుందని ఆశాజీవులు భావిస్తున్నారు. చరిత్రలో పెరిగిన బంగారం ధర పడిపోయిన దాఖలాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.
2/6భారతదేశంలో బంగారం ధర యాభై ఏళ్లతో పోల్చుకుంటే... రాకెట్ వేగంతో దూసుకుపోయింది. 1975లో 10 గ్రాముల అపరంజి బంగారం ధర రూ. 540 ఉండేది. 25 యేళ్ల నాటికి అంటే 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 4 వేల 400 చేరుకుంది. మరో 25 సంవత్సరాల నాటికి అంటే.. 2025 అక్టోబరు 17 దీపావళికి మూడు రోజుల ముందు నాటికి 10 గ్రాముల అపరంజి బంగారం ధర ఒక లక్షా 35వేల 500 రూపాయలకు పెరిగింది.
3/624 క్యారెట్ల అపరంజి బంగారం కంటే.. 22 క్యారెట్ల నాణ్యతగల ఆభరణాల బంగారం ఒక లక్షా 22వేల రూపాయలు పలుకుతోంది. ఒకేరోజు ఆభరణాల బంగారంపై మూడు వేలరూపాయలు పెరిగాయి. సామాన్యులు మాత్రం బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు మాత్రం తప్పని పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.
4/6వివాహాది శుభకార్యాలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. దీపావళి రావడంతో 22 క్యారెట్ల బంగారం అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఆర్థిక స్తోమత ఉన్నవారు బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి బంగారు కాసులు, ఆభరణాలను కొనుగోలు చేసి దీపావళి పూజలు నిర్వహించి వినియోగిస్తారు. దీపావళి ముందుగా ధనత్రయోదశి సందర్భంగా బంగారాన్ని శక్తిసామర్థ్యాలకు మేర కొనుగోలు చేయడంతో జ్యువెలరీషాపులు సందడిగా కనిపించాయి.
5/6పండుగరోజులు, వివాహాదిశుభ కార్యాలకు ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తిచూపారు. దీపావళిరోజునేకాదు.. రోజువారి మార్కెట్ సమయంలో ఎక్స్ఛేంజ్ ట్రేడ్ ఫండ్ల ద్వారా బంగారు కొనుగోలు పోటీ పడటం అలవాటుగా మారింది. బంగారంపై ఎంతపెట్టుబడి పెట్టినా నష్టం ఉండదనే భరోసాతో వెనుకాడకుండా బంగారం వ్యాపారంతో ఇన్వెస్టర్లు వేలకువేలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
6/6దీంతో బంగారాన్ని భౌతికంగా కొనుగోలుచేసేవారికంటే.. డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు పెరిగిపోతున్నారు. భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతూ పోతుందే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మూఢాలు నడుస్తోన్న బంగారం కొనుగోలు మందకొడిగా ఉన్నా.. ఫిబ్రవరి తర్వాత ముహూర్తాలు ఉండటంతో మళ్లీ బంగారం రేట్లు పెరిగే అవకాశాలున్నాయి.