Add Zee Business As A Preferred Source
App

Gold Rate: బంగారం కొనే ప్లాన్‎లో ఉన్నారా? తొందర పడకండి.. త్వరలోనే భారీగా ధరలు తగ్గే అవకాశం.. ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు..!!

Written ByBhoomi
Published: Sep 08, 2025, 10:51 AM IST|Updated: Sep 08, 2025, 10:51 AM IST

Gold Rate:  బంగారం ధరలు చరిత్రలోనే ఎప్పుడూ లేని రీతిలో  గరిష్ట స్థాయికి చేరాయి. ఒక్క వారంలోనే 10 గ్రాముల బంగారం ధర రూ 10000 పెరిగి పసిడి ప్రియుల్లో ఆందోళనకు కారణమైంది. శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో అక్టోబర్ డెలివరీ కాంట్రాక్ట్ రూ.1,07,807 వరకు దూసుకెళ్లి రికార్డు స్థాయిని తాకింది. చివరికి అది రూ.1,07,740 వద్ద ముగిసింది. ఇది బంగారం ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతుందనే సంకేతాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Gold Price Forecast1/6

బంగారం ధర చరిత్ర చూడని విధంగా

బంగారం ధరలో చరిత్ర చూడని విధంగా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు తులం 10 గ్రాముల బంగారం ధర లక్షా పదివేలకు చేరువైంది. దీంతో బంగారం ప్రియులు బంగారం అనే మాట అంటేనే భయపడేలా మారింది. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో పసిడి ధరల్లో కదలిక ప్రధానంగా ద్రవ్యోల్బణ గణాంకాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. 

Gold Outlook India2/6

అమెరికా, చైనా, జర్మనీ, భారత్

అమెరికా, చైనా, జర్మనీ, భారత్ వంటి పెద్ద దేశాలు విడుదల చేసే తాజా డేటా బంగారం దిశను మార్చుతుందని అంటున్నారు.  అంతేకాకుండా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్  సమావేశం, అలాగే అమెరికా వినియోగదారుల భావజాలం కూడా బంగారం పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.   

MCX Gold Rates3/6

బంగారం ధరలు గరిష్ట స్థాయి

విశ్లేషకులు చెబుతున్న విషయం ఏంటంటే..  ప్రస్తుతం బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఉంది. కాబట్టి కొంచెం లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని రోజులు ధరలు కొంత తగ్గినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. రానున్న రోజుల్లో పసిడి ధరలు భారీగా పతనం అవ్వకున్నా..చైనా బంగారాన్ని మార్కెట్లోకి విక్రయించినట్లయితే 70 నుంచి 80వేలకు 10 గ్రాముల పసిడి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   అయినప్పటికీ  బంగారం పై దిశ ఇంకా పెరుగుదల వైపే ఉందని నిపుణుల అభిప్రాయం. ఎంసీఎక్స్ లో త్వరలోనే 10 గ్రాముల ధర రూ.1,10,000 నుండి రూ.1,12,000 మధ్య చేరే ఛాన్స్ ఉందని వారు చెబుతున్నారు. 

Gold Price Prediction4/6

సెంట్రల్ బ్యాంక్ బంగారం

బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. డాలర్ విలువ తగ్గడం, చైనాలోని సెంట్రల్ బ్యాంక్ బంగారం నిల్వలను పెంచుకోవడం, అమెరికా మార్కెట్‌లోని ప్రతికూల పరిస్థితులు..  ఇవన్నీ కూడా బంగారంపై డిమాండ్ పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు ఎప్పటిలాగే బంగారాన్ని సురక్షిత పెట్టుబడి (Safe Haven)గా చూస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో నష్టాలు కనిపిస్తే, బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడం సహజం. దీంతో ధరలు మరింత ఎగబాకుతున్నాయి.

Bullion Market News5/6

దసరా, దీపావళి, పెళ్లి సీజన్

మరోవైపు  భారతదేశంలో పండుగల సీజన్ మొదలుకావడం కూడా బంగారానికి అదనపు బలాన్నిస్తోంది. దసరా, దీపావళి, పెళ్లి సీజన్  ఇవన్నీ బంగారం డిమాండ్‌ను పెంచుతాయి. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు మరింత పెరగడం సహజం.

Will Gold Become Cheaper6/6

దీర్ఘకాలికంగా బంగారం ధరలు

తక్షణ లాభాల బుకింగ్ కారణంగా ధరల్లో చిన్నచిన్న మార్పులు జరిగినా, దీర్ఘకాలికంగా బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పెట్టుబడిదారులు వ్యూహాత్మకంగా కొనుగోళ్లు చేయాలని, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి కోణంలో బంగారం సురక్షితమని సూచిస్తున్నారు.