Add Zee Business As A Preferred Source
App

Gold Rate: బంగారం తులం రూ. 3 లక్షలు దాటే ఛాన్స్.. కారణాలు తెలిస్తే పసిడి ప్రియులకు కన్నీళ్లు ఆగవు...!!

Written ByBhoomi
Published: Sep 05, 2025, 09:10 PM IST|Updated: Sep 05, 2025, 09:10 PM IST

Gold Rate:  చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధర అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తోంది. ప్రతిరోజు వెయ్యి రూపాయలు చొప్పున పెరుగుతూ గడిచిన వారం రోజుల్లో దాదాపు 6000 బంగారం ధర పెరిగిపోయింది. ఇది ఒక రకంగా రికార్డు అని చెప్పవచ్చు. ప్రస్తుతం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర  చరిత్రలోనే తొలిసారిగా 1.09 లక్షల రూపాయలు దాటేసింది.  
 

Gold Price1/6

బంగారు ఆభరణాలు

ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు  కొనడం అనేది చాలా కష్టంగా మారిపోయింది అని చెప్పవచ్చు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకీ తగ్గుతోంది. ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని జ్యువలరీ షాప్ యజమానులు వాపోతున్నారు.  ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధానంగా స్టాక్ మార్కెట్లో భారీగా పతనం అవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. 

Gold Rate India2/6

డాలర్ విలువ

దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎక్కువ మొత్తంలో బంగారం పైనే పెడుతున్నారు ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. దీనికి తోడు డాలర్ విలువ కూడా  భారీగా పతనం అవడం గమనించవచ్చు. అలాగే అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా సుంకాల పెంపుతో  అమెరికాలో తొలిసారిగా  పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణ  సమస్య ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 

Gold Price Hike3/6

నిత్యవసర వస్తువుల నుంచి ఔషధాల వరకు

ముఖ్యంగా నిత్యవసర వస్తువుల నుంచి ఔషధాల వరకు అన్నింటి ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక మాంద్యం  వైపు తరలి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు జోరందుకుంటున్న నేపథ్యంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది అని చెప్పవచ్చు.   

3LakhPerTola4/6

అమెరికాలో ఒక ఔన్స్

ఇదిలా ఉంటే  బంగారం ధర గడిచిన అమెరికాలో ఒక ఔన్స్ చరిత్రలోనే తొలిసారిగా 3700 డాలర్ల సమీపానికి చేరుకుంది.  అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర అత్యంత వేగంగా 5000  డాలర్లకు సైతం చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. బంగారం ధర త్వరలోనే రెండు లక్షల రూపాయలకు చేరుకోవడం పెద్ద కష్టం కాదని కూడా అంచనా వేస్తున్నారు. 

Gold Investment5/6

మూడు లక్షల రూపాయల

ఫలితంగా బంగారం ధర  సమీప భవిష్యత్తులో మూడు లక్షల రూపాయలకు వెళ్లిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పతనం అవడమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.  డాలర్ విలువ పతనం అయ్యే కొద్ది బంగారం విలువ పెరుగుతుంది.

Indian Economy6/6

బంగారం అనేది ఒక సెంటిమెంట్

 ఇది ఇలా ఉంటే మన దేశంలో బంగారం అనేది ఒక సెంటిమెంట్ అని చెప్పవచ్చు కానీ దేశీయ కారణాల కన్నా అంతర్జాతీయ కారణాలవల్లనే బంగారం ధర విపరీతంగా పెరుగుతుందని అంచనా వేయవచ్చు.  అయితే సమీప భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా అంటే  ఒకవేళ తగ్గాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రేంజ్ నుంచి బంగారం ధర 10 శాతం తగ్గుముఖం  పట్టాలన్నా,  ప్రస్తుతం అమెరికా అలాగే ఇతర ప్రపంచ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులు సాధారణం కన్నా ఎక్కువగా పురోగమ  స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది.