Add Zee Business As A Preferred Source
App

Gold: బంగారం ధర.. త్వరలోనే తగ్గుతుంది.. ఈ ధరకు రాగానే వెంటనే కొనేయండి.. గోల్డ్ మన్ సాచ్స్ కీలక సూచన ఇదే..!!

Written ByBhoomi
Published: Oct 08, 2025, 08:43 PM IST|Updated: Oct 08, 2025, 08:43 PM IST

Goldman Sachs gold forecast: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణ ప్రజలకు బంగారం కొనడం అంటే భయపడుతున్నారు. బంగారం అనేది ఒక కలలా మారిందనే చెప్పాలి. తాజాగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ గోల్డ్ మన్ సాచ్స్ ఓ సంచలన అంచనాను వెల్లడించింది.  2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 4,900 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అంటే ఇది మునుపటి అంచనా 4,300 డాలర్ల కంటే గణనీయంగా ఎక్కువ అని అర్థం.

Goldman Sachs analysts1/7

గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషకులు

రాయిటర్స్ నివేదిక ప్రకారం, గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషకులు బంగారం మార్కెట్‌లో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు,  ETF (Exchange Traded Funds) పెట్టుబడులే ప్రధాన బలంగా ఉన్నాయని చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ ETFల్లో భారీగా పెట్టుబడులు రావడం వల్ల గోల్డ్ ధరలు ఊపందుకున్నాయి.

US dollar weakness2/7

అమెరికా డాలర్ బలహీనత

తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 3,960 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇంట్రాడేలో ఇది 3,977 డాలర్ల గరిష్టాన్ని తాకింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం దాదాపు 51శాతం పెరిగింది. దీని వెనుక ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. అమెరికా డాలర్ బలహీనత, రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు,  పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తుల వైపు మళ్లడం ఇవన్నీ కూడా బంగారం పెరుగుదలకు కారణాలుగా చెప్పుకోవచ్చు.  

In 2026, it will be 70 tons.3/7

2026లో ఇది 70 టన్నుల

గోల్డ్‌మన్ అంచనాల ప్రకారం, 2025లో సగటున కేంద్ర బ్యాంకులు నెలకు 80 టన్నుల బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 2026లో ఇది 70 టన్నుల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ విదేశీ నిల్వల్లో బంగారం వాటాను పెంచుతాయని అంచనా వేస్తున్నారు.

US Federal Reserve interest rates4/7

US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు

అదే సమయంలో US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు వచ్చే ఏడాది 100 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని కూడా గోల్డ్‌మన్ పేర్కొంది. వడ్డీ రేట్లు తగ్గితే, బంగారం వంటి  నాన్-యీల్డ్ అసెట్స్  పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారతాయి.

Mehta Equities Commodities5/7

మెహతా ఈక్విటీస్ కమోడిటీస్

మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ విభాగ ఉపాధ్యక్షుడు రాహుల్ కలాంత్రి ప్రకారం, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ట్రాయ్ ఔన్సుకు 4,000 డాలర్ల దగ్గర కదులుతోంది. ETF హోల్డింగ్‌లు ఈ ఏడాది 17శాతం పెరిగాయని, ఇదే ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణమని తెలిపారు.

Rahul Kalantri6/7

రాహుల్ కలాంత్రి

భారత మార్కెట్ విషయానికి వస్తే.. రాహుల్ కలాంత్రి అంచనా ప్రకారం బంగారం మద్దతు స్థాయి రూ. 1,19,600–1,19,280 మధ్య ఉండగా, నిరోధం రూ. 1,20,850–1,21,400 మధ్య ఉందని చెప్పారు. అంటే.. ఈ స్థాయిలో కొనుగోలు చేయడం జాగ్రత్తగా చేయాల్సిన అవసరముందని హెచ్చరిస్తున్నారు.

Goldman Sachs7/7

గోల్డ్‌మన్ సాచ్స్

మొత్తం మీద, గోల్డ్‌మన్ సాచ్స్ తాజా అంచనా ప్రకారం, 2026 నాటికి బంగారం ధర మరింత ఎగిసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్, పెట్టుబడిదారుల విశ్వాసం, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు ఇవన్నీ బంగారం మార్కెట్‌కు బలాన్నిస్తున్నాయని చెప్పుకోవచ్చు.