Add Zee Business As A Preferred Source
App

Gold Rate: తులం బంగారం ధర రూ.37 వేలు.. ఇంత తక్కువ ధరకే ఎలా వస్తుందో తెలిస్తే ..అంతా మోదీ సార్ మహిమే అనక తప్పదు..!!

Written ByBhoomi
Published: Sep 09, 2025, 12:34 PM IST|Updated: Sep 09, 2025, 12:34 PM IST

Gold Rate: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు అందనంత స్పీడ్ గా పరుగెడుతున్నాయి. పది గ్రాముల తులం బంగారం ధర లక్షా 25వేలకు చేరువలో ఉంది. దీంతో బంగారం  కొనుగోలు చేయాలెంటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునేవారికి కేంద్రంలోని మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 37వేలకే తులం బంగారం లభిస్తోంది. అది కూడా హాల్ మార్క్ సర్టిఫికేట్ తో. ఎలా అనుకుంటున్నారా. అయితే ఈ స్టోరీ చదవండి. 

Gold price in India 20251/7

భారతీయులకు, బంగారానికి మధ్య ప్రత్యేక అనుబంధం

భారతీయులకు, బంగారానికి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో చాలా మంది కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునేవారికి మోదీ సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు తులం బంగారం కేవలం 37వేలకే కొనుగోలు చేయవచ్చు. 

Modi Gold scheme 9 carat2/7

37వేలకే తులం బంగారం

37వేలకే తులం బంగారం అంటే షాక్ అవ్వడం సహజమే. కానీ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ పది గ్రాములు కొనాలంటే లక్ష 15వేల పైగానే ఖర్చు అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ 37వేల బంగారం 9 క్యారెట్ల గోల్డ్. దీనినే ఇప్పుడు చాలా మంది మోదీ గోల్డ్ అని కూడా పిలుస్తున్నారు. 

Buy gold at 37,000 per tola3/7

క్యారెట్లను బట్టి బంగారం ధర

బంగారం క్యారెట్లు అనేది దాని ప్యూరిటీ ఆధారంగా ఉంటుంది. 24 క్యారెట్ అంటే 100శాతం స్వచ్ఛమైన బంగారం. దాని తర్వాత 22, 18, 14, 9 క్యారెట్లు ఉంటాయి. క్యారెట్లను బట్టి బంగారం ధర నిర్ణయిస్తుంది. అంతకు ముందు 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్క్ ఉండేది కాదు. దీంతో నాణ్యత తక్కువగా ఉన్న బంగారం కూడా మార్కెట్లో అమ్ముతూ మోసాలు ఎక్కువయ్యాయి.

Hallmark gold India rules4/7

బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్

దీని నివారణ కోసం BIS (Bureau of Indian Standards) తాజాగా నిబంధనలను మార్చింది. ఇకపై 9 క్యారెట్ నుండి 24 క్యారెట్ల వరకు అన్ని బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది. అంటే ఇకపై ఏ బంగారు నగలైనా కొనాలంటే దానిపై BIS హాల్‌మార్క్ ఉండాలి. ఇది వినియోగదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, మోసాలను నివారించడమే లక్ష్యమని  చెబుతోంది.

9k vs 24k gold price India5/7

22 క్యారెట్లు లేదా 24 క్యారెట్ల బంగారం

అలాగే ధరల కారణంగా 22 క్యారెట్లు లేదా 24 క్యారెట్ల బంగారం కొనలేని వారికి, 9 క్యారెట్ల బంగారం ఒక అవకాశంగా నిలుస్తుంది. ఉదాహరణకు 10 గ్రాముల 9 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ. 37,000 మాత్రమే అవుతుంది. ఇదే 24 క్యారెట్లతో పోల్చితే చాలా తక్కువ అని చెప్పవచ్చు.   

BIS hallmark gold jewellery6/7

ఆభరణంపై BIS లోగో

బంగారం కొనుగోలు చేసే ముందు వినియోగదారులు తప్పనిసరిగా హాల్‌మార్క్ చెక్ చేయాలి. ప్రతి ఆభరణంపై BIS లోగో తో పాటు 6 అంకెల యూనిక్ ఐడీ ఉంటుంది. ఆ కోడ్‌ను BIS మొబైల్ యాప్‌లో చెక్ చేసి ఆ బంగారం నిజమైనదా, దాని శుద్ధత ఎంత అన్నది తెలుసుకోవచ్చు.

Affordable gold jewellery India7/7

బంగారం కొనుగోలు చేసే వారికి భరోసా

కేంద్రం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల బంగారం కొనుగోలు చేసే వారికి భరోసా పెరుగుతుంది. ఇకపై హాల్‌మార్క్ ఉన్న బంగారమే నమ్మకమైనదని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అలాగే తక్కువ ధరలో కూడా నాణ్యమైన బంగారాన్ని పొందే అవకాశం కలుగుతుంది. దీంతో బంగారం మార్కెట్‌లో కొత్త మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.