Gold Rate Today: బంగారం ధరలు ఏమాత్రం తగ్గనంటున్నాయి. రికార్డు స్థాయిని మించి దూసుకెళ్తున్నాయి. డిసెంబర్ 4వ తేదీ గురువారం పసిడి ధరలను చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,280 పలుకుతుండగా.. 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1,20,150 పలుకుతోంది. వెండి అదే స్థాయిలో దూసుకుపోతోంది. కిలో వెండి ధర చూస్తే రూ. 1,84,960 పలుకుతోంది.
1/6బంగారం ధరలు కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తున్నాయి. డిసెంబర్ 4వ తేదీ గురువారం నాటి తాజా ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,280కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,20,150 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కూడా దూసుకెళ్తూ కిలోకు రూ. 1,84,960 వద్ద ఉంది. బులియన్ మార్కెట్ పూర్తిగా సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. గత 4 రోజులుగా బంగారం ధరల్లో కనిపిస్తున్న భారీ పెరుగుదల మార్కెట్‌ను తిరిగి ఆల్‌టైం హైకు దగ్గరికి తీసుకువచ్చింది.
2/6ప్రస్తుతం బంగారం రేట్లు గతంలో నమోదైన గరిష్ట స్థాయికి చేరువలోనే ఉన్నాయి. అక్టోబర్ 20న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1.35 లక్షల మార్క్‌ను తాకింది. ఇప్పుడు ఆ రికార్డును మళ్లీ బ్రేక్ చేయడానికి కేవలం వేల రూపాయల దూరంలో ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఈ పెరుగుదలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారం విలువ వేగంగా ఎగసిపడుతుండడం దేశీయ మార్కెట్‌పై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది.
3/6అమెరికా కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర 4250 డాలర్లను దాటడం ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. డాలర్ విలువ గణనీయంగా పడిపోవడం కూడా బంగారానికి అదనపు బలం చేరుస్తోంది. అలాగే ఫెడరల్ రిజర్వ్ త్వరలో నిర్వహించబోయే సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు పెట్టుబడిదారులను బంగారం వైపు మరింతగా మళ్లించాయి.
4/6డాలర్ బలహీనతను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్లు తమ మొత్తాలను సేఫ్ హావెన్ అయిన బంగారంలో పెట్టడం ప్రారంభించడంతో ధరలు మరింత ఎగబాకుతున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం త్వరలోనే బంగారం ఆల్ టైం రికార్డును మాత్రమే కాకుండా దానిని అధిగమించే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే, వెండి ధరలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.
5/6వెండి ధరలు మళ్లీ 2 లక్షల రూపాయల స్థాయిని చేరే దిశగా పయనించడం గమనార్హం. గతంలో వెండి కిలో ధర రెండు లక్షలు దాటగా, ఇప్పుడు తిరిగి అదే స్థాయికి చేరుకోవడానికి అడుగుల దూరంలో ఉంది. బులియన్ మార్కెట్ ప్రస్తుతం భారీ ర్యాలీని కొనసాగిస్తోంది.
6/6Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.