Gold And Silver Rates Today February 4: ఈ మధ్య కాలంలో వరుసగా గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనం చవిచూశాయి. అయితే, రాత్రికి రాత్రే వీటి ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలో వరుసగా మూడు రోజులు బంగారం, వెండి ధరలు పడిపోయాయి. మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.5000 లేదా 3.3 శాతం పెరిగి రూ.1,57,700 చేరింది. ఈరోజు బంగారం వెండి ధరలు ప్రాంతాలవారీగా ఎలా ఉన్నాయి తెలుసుకుందాం.
1/5గత నెల జనవరి 29వ తేదీన బంగారం ఆల్ టైం హై రికార్డు సృష్టించింది. రూ.1,83,000 పదిగ్రాముల బంగారం ధర రికార్డు నమోదు చేసింది. సడగ్‌గా దీని ధర తాజాగా రూ.30,300 తగ్గిపోయింది. అంటే దాదాపు 17 శాతం గోల్డ్ రేట్ పడిపోయింది.
2/5ఇక మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX) 24 క్యారట్‌ల బంగారం ధర 0.16 శాతం పడిపోయి రూ.1,49,000 పదిగ్రాములు సోమవారం నాటికి నమోదు చేసింది. గత గురువారం రూ.1,80,779 పది గ్రాముల బంగారం ధర పెరిగింది. ఆ తర్వాత వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ పతనాన్ని చవిచూశాయి.
3/5తాజాగా ఈరోజు పదిగ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.1,54,090 కు పడిపోయింది. గత గురువారం మాత్రం వీటి ధరలు పదిగ్రాములకు రూ.1,79,010 గా నమోదైంది. ఈరోజు ఉదయం ఇండియన్ బులియన్, జువెలర్స్ అసోసియేషన్ (IBJA) రూ.1,51,529 వద్ద ఉంది. ఇక ఐబీజేఏ డేటా ప్రకారం 24, 23, 22, 18, 14 క్యారెట్‌ల బంగారం ధరను కూడా విడుదల చేసింది.
4/5ఈరోజు 24 క్యారెట్‌ల బంగారం పదిగ్రాములకు రూ.153,940 ఉంది. ఇక 22 క్యారెట్‌లు రూ.14,1110 వద్ద ఉంది. వెండి ధరల విషయానికి వస్తే వరుసగా 12 నెలలపాటు 200 శాతం ర్యాలీ చేసింది. 31 వేలు కిలో వెండి ధర పెరిగి రూ.2,79,000 వద్దకు చేరింది.
5/5రాత్రికి రాత్రే సీన్ రివర్స్ అయితే ఈ బంగారం, వెండి ధరలు పెరిగిపోయాయి. 2008 తర్వాత రికార్డు స్థాయిలో పెరిగిన గోల్డ్ సిల్వర్ ధరలు. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలే ఈ విలువైన లోహాల ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.