Gold Rate: గుడ్ న్యూస్.. బంగారు నగలు ఇక నుంచి EMIలోనూ కొనవచ్చు.. కేంద్రం ముందున్న కొత్త ప్రాతిపాదన ఇదే..!!

Gold Rate EMI: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. చరిత్రలో ఏనాడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న సామాన్యులకు మాత్రం ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశమని  చెప్పవచ్చు. ఎందుకంటే పెద్దమొత్తంలో డబ్బును ఖర్చు చేసి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే స్తోమత వారి దగ్గర లేకపోవడమే. అయితే సామాన్యులకు ఇలాంటి పరిస్థితుల నుంచి బయపడేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ఈఎంఐ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ చెబుతోంది. ఈ ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది. 

1 /6

ఈ మధ్యకాలంలో పసిడి ధరలు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా  పెరుగుతూ, ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1.06 లక్షలు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 96 వేల రూపాయలకు చేరుకుంది. ఇది ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని స్థాయి అని చెప్పవచ్చు. 

2 /6

ఈ పెరుగుదల కారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు  చాలా కష్టసాధ్యమైందని చెప్పవ్చు. ముఖ్యంగా భారతీయులకు పసిడి అనేది కేవలం లోహం కాదు, ప్రతి శుభకార్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, ఫంక్షన్లు ఇలా ఏ సందర్భమైనా బంగారం లేకుండా జరగడం చాలా అరుదు అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనడం అంటే ఒక పెద్ద భారంగా మారిపోయింది.  

3 /6

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా గోల్డ్ మెర్చంట్స్ అసోసియేషన్ కొన్ని కీలకమైన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందు ఉంచింది. అందులో అత్యంత ముఖ్యమైనది బంగారు ఆభరణాల కోసం ఈఎంఐ రూపంలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఇళ్లు, వాహనాలు లేదా వ్యాపార రుణాలకే బ్యాంకులు ఈఎంఐ సౌకర్యం ఉందన్న సంగతి తెలిసిందే. కానీ భవిష్యత్తులో బంగారం కొనుగోలు కోసం కూడా ఈఎంఐ ఆప్షన్ కల్పిస్తే ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

4 /6

గత ఐదు సంవత్సరాలలో బంగారం ధర దాదాపు 100శాతం పెరిగిందని చెప్పవచ్చు.  ఈ వేగవంతమైన పెరుగుదల కారణంగా ఒకప్పుడు సులభంగా కొనగలిగే ఆభరణాలు ఇప్పుడు సాధారణ కుటుంబాలకు అందని ద్రాక్షలా  మారాయి. బంగారం, వెండి మెర్చంట్స్ అసోసియేషన్లు సూచించినట్లుగా, ఈఎంఐలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తే, ప్రజలు తక్కువ డబ్బుతోనే  పసిడి ఆభరణాలు కొనుగోలు చేయగలిగే అవకాశం ఉంటుంది.   

5 /6

ఈ పద్ధతి అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా లాభదాయకమే అవుతుందని  చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగారం కొనుగోలు పెరిగితే జీఎస్టీ కూడా పెరుగుతుంద. అదే సమయంలో ఆభరణాల పరిశ్రమకు కూడా ఇది పెద్ద బూస్ట్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. పైగా, కస్టమర్ల సిబిల్ స్కోర్ ఆధారంగా  ఈఎంఐ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా పారదర్శకత కూడా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

6 /6

బ్యాంకులు ఇప్పటికే ఇళ్లు, వాహనాలు, వ్యాపారాల కోసం లోన్స్ ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో బంగారు ఆభరణాల కోసం కూడా రుణాలు, ఈఎంఐ సౌకర్యాలు అందిస్తే బ్యాంకింగ్ రంగానికి కొత్త ఆదాయం వనరు లభిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు, బంగారం పై ప్రజల సెంటిమెంట్ దృష్ట్యా ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, మార్కెట్లో మరింత డిమాండ్ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు  అభిప్రాయపడుతున్నారు.