Gold Purity: బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నవారిలో ఓ సందేహం ఉంటుంది. మనం కొనుగోలు చేస్తున్న ఆభరణాలు అసలా..నకిలీవా.. బంగారం ధర చెల్లించిన తర్వాత ఇత్తడి, రాగి కలిపిన ఆభరణాలను ఇంటికి తీసుకెళ్లలేరు. ఇలా చాలా మందికి జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లో సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆభరణాలు కొనాలనుకునేవారు ఆందోళన చెందడం సహజమే. కాబట్టి బంగారం నిజమో, నకిలీదో గుర్తించడం ఎలా? ఏవిధంగా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం అంటే ఇష్టపడని వారుండరు. మన దేశంలోని మహిళలు బంగారం కొనడం కేవలం అలంకరణ కోసమే కాకుండా.. దాన్ని శుభసూచకంగా భావిస్తుంటారు. కొందరు శరీరమంతా భారీగా సైజులో ఉన్న బంగారు ఆభరణాలు ధరించి అందరి ద్రుష్టిని ఆకర్షిస్తుంటారు.
పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 1.20లక్షలకుపైగానే ఉంటుంది. బంగారం కల్తీ అంటే ఆభరణాల తయారీలో వ్రుధా అయ్యే బంగారం మొత్తం, దాని ప్యూరిటీ ఎంత వరకు తగ్గుతుందో సూచిస్తుంది.
దీనిని సాధారణంగా క్యారెట్, మలినాల శాతం ఈ రెండింటి ద్వారా కొలుస్తుంటారు. ఇతర లోహాలకు 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం కలపడం వల్ల దాని బలం మరింత పెరుగుతుంది. అయితే ఈ మిశ్రమంలోని లోహాల శాతం బంగారం ప్యూరిటీని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా బంగారు షాపుల నుంచికొనుగోలు చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది. స్వర్ణకారుడు తయారు చేస్తే మరో విధంగా ఉంటుంది.
24 క్యారెట్ల బంగారం చాలా పెళుసుగా ఉంటుంది. దీనితో ఆభరణాలు తయారు చేయలేరు. అందుకే దాన్ని బలోపేతం చేసేందుకు అందులో రాగి, జింక్, వెండి, కాడ్మియం వంటి లోహాలను కలుపుతారు. ఈ లోహాల శాతం బంగారం స్వచ్చతను నిర్ణయిస్తుంది. ఈ లోహాల అధిక శాతాన్ని 22 క్యారెట్ల బంగారం అని, ఎక్కువ శాతాన్ని 18 క్యారెట్ల బంగారం అని పిలుస్తారు.
బంగారు ఆభరణాలు తయారు చేసేటప్పుడు, కటింగ్, జాయినింగ్, పాలిషింగ్ మొదలైన వాటి వల్ల కొంత వృధా అవుతుంది. 22 క్యారెట్ల బంగారంతో నగలు తయారు చేసేటప్పుడు, 10 గ్రాములకు 1 గ్రాము కల్తీ జరుగుతుందని స్వర్ణకారులు చెబుతున్నారు. 10 గ్రాముల బిస్కెట్ బంగారంతో తయారు చేసిన ఏదైనా ఆభరణాలలో 1 గ్రాము కల్తీ ఉంటుంది.
బంగారు ఆభరణాలను కరిగించినప్పుడు, దానిలోని లోహాలు ఆవిరైపోతాయి. అందువల్ల, మీరు అందుకున్న బిస్కెట్ మీరు ఇచ్చిన ఆభరణాల కంటే తక్కువ బరువు ఉంటుంది. పెట్టుబడి దృక్కోణం నుండి, ఆభరణాలను బిస్కెట్లుగా కరిగించడం ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎటువంటి తయారీ ఛార్జీలు లేకుండా స్వచ్ఛమైన బంగారాన్ని పొందుతారు. మీరు బంగారాన్ని మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంటే, దానిని కరిగించి బంగారు బిస్కెట్ లేదా స్వర్ణకారుడి వద్ద ఉన్న బండిల్‌గా మార్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
చాలా మంది కొన్నిసార్లు కల్తీ గురించి సమాచారం లేకపోవడం వల్ల నష్టపోతారు. బంగారం ధర రూ. 1.20 లక్షలు దాటినప్పుడు.. ఈ సమాచారం గురించి తెలియకపోవడం వల్ల వినియోగదారులు నష్టపోతారని స్వర్ణకారులు చెబుతున్నారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.