Add Zee Business As A Preferred Source
App

Gold Rate: దుబాయ్ నుంచి బంగారు నగలు తెచ్చుకోవడం నిజంగా లాభమేనా? అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయా?

Written ByBhoomi
Published: Sep 11, 2025, 08:41 PM IST|Updated: Sep 11, 2025, 08:41 PM IST

Dubai Gold Jewellery 2025: ఈమధ్య కాలంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.12 లక్షలు దాటింది. 22 క్యారెట్ల బంగారం రూ.1.01 లక్షలకు పైగా పలుకుతోంది. ఈ పెరుగుదలతో చాలా మంది భారతీయులు దుబాయ్‌ నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం లాభమా?అనే ప్రశ్న వారిలో మెదులుతోంది. ఎందుకంటే దుబాయ్ బంగారం నాణ్యతతో పాటు తక్కువ ధరకు లభించడమే కారణం. 

Dubai Gold Jewellery 20251/7

బంగారం డిమాండ్

దేశంలో బంగారం డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ, ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ అని చెప్పవచ్చు. దాదాపు 95 శాతం డిమాండ్‌ను ఇతర దేశాల దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే మన దేశంలో బంగారం ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు దిగుమతి సుంకాలు, జీఎస్టీ, తయారీ చార్జీలు, వేస్టేజ్ ఖర్చులు కలిపి దేశంలో బంగారు ఆభరణాల ధరను మరింతగా పెంచుతున్నాయని చెప్పవచ్చు. 

Gold Price in Dubai vs India2/7

సిటీ ఆఫ్ గోల్డ్

అయితే దుబాయ్‌ “సిటీ ఆఫ్ గోల్డ్”గా పేరుగాంచిన నగరమనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇక్కడి మార్కెట్లలో బంగారం నాణ్యత, డిజైన్లు, రేట్లు అన్ని ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచాయి. ప్రస్తుతానికి దుబాయ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 439 దిరహమ్స్‌ అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1,00,200గా ఉంది. అదే 22 క్యారెట్ల ఆభరణాల ధర 10 గ్రాములకు 406 దిరహమ్స్‌, అంటే సుమారు రూ.94,000 మాత్రమే. ఈ ధరను భారత రేట్లతో పోలిస్తే ఒక్కో తులం (10 గ్రాములు) బంగారం దాదాపు రూ.7,000 నుంచి 8,000 వరకు తక్కువగా వస్తోంది.  

Buying Gold from Dubai Profitable or Not3/7

జీఎస్టీతో పాటు మేకింగ్ ఛార్జీలు

భారతదేశంలో ఆభరణాలు కొంటే జీఎస్టీతో పాటు మేకింగ్ ఛార్జీలు 8శాతం నుంచి 12శాతం వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దుబాయ్‌లో ఈ ఖర్చులు తక్కువగా ఉండటంతో ఆభరణాలు కొంటే ఖచ్చితంగా కొంత ఆదా అవుతుంది.

Indian Customs Rules on Gold Import4/7

దుబాయ్‌ నుంచి ఎంత బంగారం

అందుకే దుబాయ్‌కి వెళ్ళే భారతీయులు షాపింగ్‌లో భాగంగా బంగారం కొనుగోలు చేయడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే దుబాయ్‌ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చో అన్న విషయంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 

22 Carat Gold Rate Dubai5/7

20 గ్రాముల బంగారు ఆభరణాలు

భారత ప్రభుత్వం నిర్ణయించిన నియమాల ప్రకారం పురుషులు గరిష్టంగా 20 గ్రాముల బంగారు ఆభరణాలు మాత్రమే తీసుకురావచ్చు. మహిళలు 40 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. పిల్లల పేరుతో అదనంగా 20 గ్రాములు తెచ్చుకోవచ్చు.   

Is Dubai Gold Cheaper than India6/7

కస్టమ్స్ ట్యాక్స్

ఈ పరిమితిని మించి బంగారం తీసుకురావాలనుకుంటే కస్టమ్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల కొద్ది పరిమితుల్లో మాత్రమే దుబాయ్‌ నుంచి బంగారం కొనుగోలు చేయడం లాభదాయకం అవుతుంది. కానీ పెద్ద మొత్తంలో దిగుమతి చేయాలని చూస్తే పన్నులు, ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉండటంతో లాభం తగ్గిపోతుంది.

Dubai Gold Jewellery Shopping Guide7/7

దుబాయ్‌ నుంచి బంగారం

మొత్తం మీద దుబాయ్‌ నుంచి బంగారం కొనుగోలు చేయడం నాణ్యత, ధర, డిజైన్ల పరంగా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు కొద్దిపాటి ఆభరణాలు కొనుగోలు చేస్తే భారతదేశంలో కొన్నదానికంటే తక్కువ ఖర్చు అవుతుంది. కానీ పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలనుకుంటే కస్టమ్స్ పరిమితులు, పన్నుల కారణంగా పెద్దగా లాభం ఉండదని గుర్తుంచుకోవాలి.