Gold Rate Today In India: నిన్న మొన్నటి వరకు దసరా, దన త్రయోదశి, దీపావళితో పాటు పెళ్లిళ్లు, పేరంటాల సందర్భంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితి నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు తగ్గు మొఖం పడుతున్నాయి.
Gold Rate Today In India:దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నిన్న మొన్నటి వరకు ధరలు ఆకాశాన్ని తాకాయి. తులం బంగారం పదో వందో పెరిగితే అమ్మో! అనుకునేవాళ్లు.. ఇపుడు ఎవ్వరూ ఊహించని విధంగా బంగారం ధరలు సామాన్యులు కొనలేనంతగా పెరిపోయాయి. వారం వారం పోల్చుకునే కంటే రోజు రోజుకీ మార్కెట్లో బంగారం రేట్లు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.
అయితే భారీగా ధరలు పెరిగినా.. అమ్మకాలు తగ్గడంలేదు. కొనేవారు పోటీ పడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం, డాలర్ తో మారకం విలువ పెరగడం వంటి పలు కారణాలు మొన్నటి వరకు బంగారం ధర పెరగడానికి దోహదం చేశాయి.
ప్రస్తుతం ఈ రోజుకు మన దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 11,603 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆర్నమెంట్ బంగారం 22 క్యారెట్లు.. రూ. 11,597 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రేట్లు మన దేశంలోని పలు నగరాల్లో స్వల్పంగా హెచ్చు తగ్గులున్నాయి. నిన్నటితో పోలీస్తే 0.28 శాతం స్వల్పంగా పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్స్స్ బంగారం రూ. 11,603 గ్రాములుగా ఉంది. ఇక చెన్నైలో కాస్త ఎక్కువగా రూ. 11,711 వద్ద ట్రేడ్ అవుతుంది. ఢిల్లీలో కంటే చెన్నైలో కాస్త ఎక్కువగా బంగారం ధర ఉంది.
వెండి ధర నిన్నటితో పోలిస్తే రెండు వేలు పెరిగి రూ. 1,62,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే ఈ రేట్లు నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగిందనే చెప్పాలి. మదుపరులు బంగారంతో పాటు వెండిని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ రేట్లు స్వల్పంగా పెరిగాయి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ప్రేక్షకుల అవగాహన కోసం మాత్రమే. దయచేసి బంగారంతో పాటు మ్యూచఫల్ ఫండ్స్, ఇతరత్రా వాటిలో పెట్టుబడి మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. అంతేకాదు మీకు తెలిసిన ఆర్ధిక నిపుణులతో సంప్రదించి మాత్రమే పెట్టుబడులు పెట్టండి. జీ మీడియా కేవలం అవగాహన కోసమే ఈ వార్తను ప్రచురించింది. దీని వల్ల కలిగే లాభ నష్టాలక జీ మీడియా బాధ్యత వహించదు.